News November 7, 2024

విరాట్ 2027 వరకు ఆడతారు: జ్యోతిషుడు

image

గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ పేలవంగా ఆడుతుండటంపై ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వారికి ఆందోళన అవసరం లేదని జ్యోతిషుడు గ్రీన్‌స్టోన్ లోబో జోస్యం చెప్పారు. ‘విరాట్ గురించి ఆయన ఫ్యాన్స్ నన్ను తరచూ అడుగుతుంటారు. ఆయన కనీసం 2027 వరకు ఆడతారు. కోహ్లీ బ్యాట్ పరుగుల వరద పారించే సమయం రానుంది. సచిన్‌ రికార్డుల్ని దాటలేకపోవచ్చు కానీ గవాస్కర్, ద్రవిడ్‌ను దాటుతారు’ అని అంచనా వేశారు.

Similar News

News November 7, 2024

ఇంటర్నెట్ దొరికిందని అదే పని..

image

7వేలమందికి పైగా నార్త్ కొరియా సైనికులు రష్యా కోసం యుద్ధం చేసేందుకు ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ లభించడంతో వారు నీలిచిత్రాలకు బానిసల్లా మారినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక తెలిపింది. రేయింబవళ్లూ అవే చూస్తున్నారని పేర్కొంది. ఉత్తర కొరియాలో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. ఇంటర్నెట్‌లోనూ ప్రభుత్వం అనుమతించిన వెబ్‌సైట్స్‌నే వారు చూడాల్సి ఉంటుంది.

News November 7, 2024

పాక్-ఇంగ్లండ్‌ సిరీస్‌లో పిచ్‌లు ఓకే: ఐసీసీ

image

పాక్‌-ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ పిచ్‌లు సంతృప్తికరంగానే ఉన్నాయని పేర్కొంటూ ఐసీసీ తాజాగా రేటింగ్ ఇచ్చింది. తొలి మ్యాచ్‌లో ముల్తాన్‌ పిచ్ బౌలర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. పాక్ 556, ఇంగ్లండ్ 823 రన్స్ చేశాయి. రెండో మ్యాచ్‌లో అదే పిచ్‌పై, మూడో మ్యాచ్‌లో రావల్పిండి పిచ్‌పై బంతి తొలి రోజు నుంచే స్పిన్ అయింది. దీంతో ఇంగ్లండ్ 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.

News November 7, 2024

ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్యేలతో సీఎం చర్చ

image

AP: ఎస్సీ వర్గీకరణలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల ఎస్సీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు చర్చించారు. దళితుల్లోని ఉపకులాలన్నింటికీ దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా జిల్లా ఒక యూనిట్‌గా వర్గీకరణ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే వర్గీకరణ అమలు చేశామని, న్యాయ సమస్య కారణంగా అది నిలిచిపోయిందని సీఎం గుర్తు చేశారు.