News November 7, 2024

పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ

image

AP: రాష్ట్ర సచివాలయంలో Dy.CM పవన్‌తో సమావేశమైనట్లు హోంమంత్రి అనిత తెలిపారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ట్వీట్ చేశారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారని పేర్కొన్నారు.

Similar News

News January 28, 2026

అయ్యర్ ఏం పాపం చేశాడు.. గంభీర్‌పై విమర్శలు

image

NZతో నాలుగో టీ20 మ్యాచులో టీమ్ ఇండియా ప్లేయింగ్-11పై విమర్శలు వస్తున్నాయి. ఇషాన్ కిషన్ దూరమైతే అతడి స్థానంలో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కాకుండా బౌలర్ (అర్ష్‌దీప్ సింగ్)ను తీసుకోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయ్యర్ 3, 4 స్థానాల్లో అద్భుతంగా ఆడగలడని, ఎందుకు ఎంపిక చేయలేదని నిలదీస్తున్నారు. ఐదుగురు ప్రొఫెషనల్ బౌలర్లు జట్టులో ఎందుకని హెడ్ కోచ్ గంభీర్‌ను ప్రశ్నిస్తున్నారు.

News January 28, 2026

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 3న మిర్యాలగూడ, 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో ప్రచారం చేయనున్నారు. కాగా ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

News January 28, 2026

ప్రమాదాల నుంచి వీళ్లు బయటపడ్డారు!

image

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ <<18980548>>చనిపోవడం<<>> తెలిసిందే. గతంలో పలువురు నేతలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. MH CM ఫడణవీస్ ఏకంగా 6సార్లు బయటపడ్డారు. 1977లో PM మొరార్జీ దేశాయ్, 2001లో అశోక్ గెహ్లోత్, 2004లో కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, పృథ్వీరాజ్ చవాన్, కుమారి షెల్జా, 2007లో అమరీందర్ సింగ్, 2009లో సుఖ్‌బీర్ సింగ్, 2010లో రాజ్‌నాథ్ సింగ్, 2012లో అర్జున్ ముండా తప్పించుకున్నారు.