News November 7, 2024

వరంగల్: ఇంటి మేడపై గంజాయి మొక్కలు పెంపకం.. వ్యక్తి అరెస్ట్

image

ఇంటి మేడపై గంజాయి మొక్కలు పెంచుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. వరంగల్ శివనగర్‌కు చెందిన కుమార్(60) సులభంగా డబ్బు సంపాదించడం కోసం ఇంటి మేడపై ఓ గృహపరిశ్రమ తరహాలో పూల కుండీల్లో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. యాంటీ డ్రగ్స్ టీం మత్తు పదార్థాలను పసిగట్టే పోలీసు జాగిలంతో గంజాయి మొక్కలను గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Similar News

News March 3, 2026

అనుమతి లేకుండా నియామకాలు వద్దు: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి కొత్త నియామకాలు చేపట్టొద్దని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో, ఆసుపత్రి సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నియామక ప్రక్రియకు సంబంధించి ముందస్తు నోటిఫికేషన్లు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఎంజీఎం, సీకేఎం, నర్సంపేట ఏరియా ఆసుపత్రి సహా రీజనల్ ఐ హాస్పిటళ్లలో త్వరలోనే మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.

News March 3, 2026

ప్రభుత్వాసుపత్రిలో సమయపాలన పాటించాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోనీ ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, డాక్టర్లు సమయపాలన పాటించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ డా.సత్య శారద హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, సూపరిండెంటెంట్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

News February 28, 2026

వరంగల్: ఇంటర్ పరీక్షలకు 212 మంది గైర్హాజరు

image

జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో విద్యార్ధుల గైర్హాజరు కలవర పెడుతోంది. ఒకే రోజులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పరీక్షకు 5,179 మందిలో 143 మంది, ఒకేషనల్ కోర్సుకు 823 మందిలో 69 మంది గైర్హాజరైనట్లు డీఈవో రంగయ్య నాయుడు తెలిపారు. మొత్తం 212 మంది హాజరు కాలేదన్నారు. పరీక్షల నిర్వహణలో పరీక్ష నిర్వాహకులుగా మాధవరావు, బండి విజయనిర్మల పూర్తి స్థాయిలో పర్యవేక్షించినట్లు వెల్లడించారు.