News November 7, 2024
HYD: ‘డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం సోదరులు

రేపు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా HYD బడంగ్‌పేట్ మాజీ వైస్ ఛైర్మన్ చిగురింత నర్సింహా రెడ్డి, యువజన కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జీవిత చరిత్ర డైనమిక్ లీడర్ పుస్తకాన్ని సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఆయన సోదరులు కృష్ణారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 9, 2026
రంగారెడ్డి జిల్లాలో రైతు రిజిస్ట్రేషన్ 88% పూర్తి

రంగారెడ్డి జిల్లా పరిధిలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు ఫోకస్ చేశారు. జిల్లాలో మొత్తం 1,97,029 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 88% రిజిస్ట్రేషన్ మాత్రమే పూర్తైనట్లుగా అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ లాంటి పథకాలు అందాలంటే రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
News March 9, 2026
రంగారెడ్డి: జిల్లాలో తొలిరోజు 139 మందికి వ్యాక్సిన్

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలి రోజులో భాగంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 139 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశారు. కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో 19 మంది, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో 10, రాజేంద్రనగర్‌లో 30, హయత్‌నగర్‌లో 10, శంషాబాద్‌లో 20, చేవెళ్లలో 22, షాద్‌నగర్‌లో 17, మహేశ్వరంలో ఏడుగురు బాలికలకు వ్యాక్సిన్ వేశారు.
News March 9, 2026
నగరంలో పెరుగుతున్న భగభగలు

నగరంలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్ మధ్యలో కనిపించే వేడి, మార్చి మొదటి వారంలోనే సెగలు పుట్టిస్తోంది. ఆదివారం నాటికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదు కాగా.. రానున్న వారం రోజుల్లో 40 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.


