News November 7, 2024

9న తిరుపతిలో ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్

image

‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్‌ను ఈనెల 9న సా.4:30కు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తిరుపతిలోని PGR థియేటర్‌లో టీజర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ నటించిన ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.

Similar News

News January 5, 2026

సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కొనసాగుతోంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకుంటున్నారు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇస్తున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మోహన్, ఆర్డీవో శ్రీనివాసులు, ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

News January 5, 2026

కుప్పంలో సత్ఫలితాలు ఇస్తోన్న CM విజన్.!

image

CM చంద్రబాబు ప్రత్యేక చొరవతో రాష్ట్రీయ ఆరోగ్య మిషన్ ద్వారా కుప్పంలో అమలు చేసున్న లింగ నిర్ధారిత వీర్యం ఇంజెక్షన్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎదకొచ్చిన ఆవులకు లింగ నిర్ధారిత వీర్యం ఇంజెక్షన్లు వేస్తున్నారు. దీంతో కుప్పం(M) నూలుకుంటలో కృష్ణమూర్తికి చెందిన ఆవుకు ఉచిత ఫిమేల్ సీమెన్ పంపిణీ చేసి వేశారు. దీంతో ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనివ్వడంతో కృష్ణమూర్తి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

News January 5, 2026

పుంగనూరు: నేడు మొదటి గ్రీవెన్స్ సెల్

image

అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ తొలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తమ సమస్యలపై బాధితులు అర్జీలు సమర్పించవచ్చని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా https://meekosam.ap.gov.in ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.