News November 7, 2024

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసులు ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఎస్పీ రత్న ఆదేశాల మేరకు హిందూపురం, పరిగి, కదిరి, బత్తలపల్లి ప్రాంతాల్లో పోలీసులు గురువారం గ్రామాల్లో పర్యటించి గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని గొడవలు, అల్లర్లకు పాల్పడకూడదని తెలిపారు. లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Similar News

News November 10, 2025

దళిత ఉద్యమ కెరటం కత్తి పద్మారావు

image

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 గుంటూరు(D) పొన్నూరుకు చెందిన పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతలో జరిగిన సభకు పద్మారావు హాజరు కాలేకపోయారు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.

News November 10, 2025

జాతీయస్థాయి పోటీలకు గుంతకల్లు విద్యార్థిని ఎంపిక

image

శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 మహిళా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఐదుగురు మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థిని, వికెట్ కీపర్ బట్నపాడు అమూల్య జాతీయస్థాయి జట్టుకు ఎంపికైంది. ప్రిన్సిపల్ సాలాబాయి, కాలేజీ సిబ్బంది, పలువురు క్రీడాకారులు ఆమెను అభినందించారు.

News November 9, 2025

అనంతలో ముగిసిన రెవిన్యూ క్రీడలు

image

అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సవిత, అనంతపురం MP అంబికా లక్ష్మీ నారాయణ, పలువురు MLAలు హాజరయ్యారు. అసోసియేషన్ నాయకులను అభినందించి, గెలుపొందిన వారికి మెమెంటోలు అందించారు.