News November 7, 2024

బాన్సువాడ కళాశాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి

image

ప్రభుత్వ జూనియర్ కళాశాల బాన్సువాడ(co-ed)లో ఇవాళ సాయంత్రం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు ఇజాజుద్దీన్, దాసరి శ్రీనివాస్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన స్టడీ అవర్స్‌ను పరిశీలించారు. అదే విధంగా పరీక్షల వరకు విద్యార్థులను కష్టపడి చదివించాలని సూచించారు. 

Similar News

News January 23, 2026

NZB: 24న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

image

సిద్దిపేటలో జరగనున్న 10వ రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ పోటీల కోసం జిల్లా జట్టు ఎంపికలు ఈ నెల 24న నిర్వహించనున్నట్లు కార్యదర్శి విజయ్ కాంతారావు తెలిపారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో అండర్-14, 16, 18 విభాగాల్లో బాలురు, బాలికలకు ఎంపికలు ఉంటాయి. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News January 23, 2026

NZB: అండమాన్‌కు అజాద్ హిందూ పేరు పెట్టాలని కవిత లేఖ

image

అండమాన్‌కు అజాద్ హిందూ పేరు పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి NZB మాజీ MP, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. జాగృతి కూడా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ల డిమాండ్‌ను సపోర్ట్ చేస్తోందన్నారు. తమకున్న నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని లేఖలో పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారన్నారు.

News January 23, 2026

NZB: హై-టెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పం: సుదర్శన్

image

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు హై-టెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్కిల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ ప్రోగ్రాంలో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.