News November 7, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ.. UAEలో భారత్ మ్యాచులు!

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 హైబ్రిడ్ మోడల్‌లో జరిగే అవకాశం ఉందని PTI తెలిపింది. భారత్ తన మ్యాచులను యూఏఈలోని దుబాయ్ లేదా షార్జాలో ఆడనుందని పేర్కొంది. నవంబర్ 11న ఆ టోర్నీ షెడ్యూల్ అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. కాగా, తొలుత ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాకిస్థాన్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అక్కడికి వెళ్లేందుకు బీసీసీఐ నో చెప్పడంతో తాజాగా మార్పులు చేసినట్లు సమాచారం.

Similar News

News November 8, 2024

గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే

image

పండుగ సీజన్ కావడంతో గత నెలలో భారత వాహన మార్కెట్ మంచి అమ్మకాల్ని నమోదు చేసింది. అత్యధికంగా మారుతీ ఎర్టిగా కారు 18,785 యూనిట్లను విక్రయించింది. 2023 అక్టోబరుతో పోలిస్తే ఇది 32 శాతం వృద్ధి. తర్వాతి స్థానాల్లో స్విఫ్ట్(17,539), క్రెటా(17,497), బ్రెజా(16,565), మారుతీ సుజుకీ ఫ్రాంక్స్(16,419), బలేనో(16,082), టాటా పంచ్(15,470), స్కార్పియో(15,677), టాటా నెక్సాన్(14,759), గ్రాండ్ విటారా(14,083) ఉన్నాయి.

News November 8, 2024

మార్స్‌పై అతి పురాతన మహాసముద్రం.. గుర్తించిన చైనా

image

అంగారకుడిపై కోటానుకోట్ల ఏళ్ల క్రితం మహాసముద్రం ఉండేదని చైనా పరిశోధకులు తేల్చిచెప్పారు. తాము పంపించిన ఝరాంగ్ రోవర్ అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించిందని వారు వెల్లడించారు. ‘మార్స్‌పై ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో నమూనాల ఆధారంగా పురాతన కాలంలో ఓ మహా సముద్రం ఉండేదని గుర్తించాం. సుమారు 3.42 సంవత్సరాల క్రితం ఆ సముద్రం ఎండిపోయింది. ఆ సమయంలో సూక్ష్మ జీవులు అక్కడ మనుగడ సాగించి ఉండొచ్చు’ అని తెలిపారు.

News November 8, 2024

గీజర్ వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి!

image

చాలామంది గీజర్‌ను గంటల తరబడి ఆన్‌లోనే ఉంచుతారు. అది ఏమాత్రం మంచిదికాదు. ఒక్కోసారి గీజర్ ఓవర్ హీట్ ఎక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక గీజర్‌ను ఏడాదికోసారి సర్వీసింగ్ చేయించాలి. అప్పుడే ఏమైనా లీకేజీ ఉంటే తెలుస్తుంది. గీజర్ కనెక్షన్ వైర్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. చాలా ఏళ్లుగా వాడుతున్న పరికరాలను మార్చడం ఉత్తమం. వాటి వల్ల షార్ట్ సర్య్కూట్ వచ్చే ప్రమాదం ఉంది.