News November 8, 2024

ప.గో: TODAY TOP NEWS

image

*భీమవరం మాజీ MLA ఇంట్లో ఐటీ సోదాలు
*జీలుగుమిల్లి: అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఇల్లు
*తణుకు: 20 మద్యం బాటిళ్లు స్వాధీనం.. వ్యక్తి అరెస్టు
*కొవ్వూరు: సీఎం సహాయనిధికి రూ.90 లక్షల అందజేత
*ఏలూరు: ‘అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత గ్యాస్ సిలిండర్’
*భీమవరం: వెంకన్న పవిత్రోత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్
*తాడేపల్లిగూడెం హైవేపై రోడ్డు ప్రమాదం
*కడప జిల్లాలో ప.గో వ్యక్తి దారుణ హత్య

Similar News

News January 31, 2026

ఉపాధి హామీ పథకంలో పారదర్శకతే మోదీ లక్ష్యం: కేంద్ర మంత్రి వర్మ

image

వీరవాసరం మండలం వడ్డిగూడెం, పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామాలలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శనివారం ఉపాధి హామీ కూలీలతో భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతే ప్రధాన లక్ష్యమని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కూలీలకు సూచించారు. విబిజి రామ్ జీ పథకంపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. కలెక్టర్ నాగరాణి పాల్గొని కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

News January 31, 2026

పాలకోడేరు: రైలు ఢీకొని యువకుడి మృతి

image

పాలకోడేరు మండలం రైల్వే గేట్ సమీపంలో 32 ఏళ్ల గుర్తుతెలియని యువకుడు రైలు ఢీకొని మృతి చెందాడు. భీమవరం రైల్వే ఎస్ఐ సుబ్రమణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి కాకినాడ-లింగంపల్లి స్పెషల్ ట్రైన్ ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చన్నారు. మృతుని గుర్తింపు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుడికి సంబంధించిన ఆచూకీ తెలిసిన వారు భీమవరం రైల్వే గవర్నమెంట్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.

News January 31, 2026

పాలకొల్లు: తండ్రి కానిస్టేబుల్.. కూతురు డీఎస్పీ

image

పాలకొల్లు పట్టణానికి చెందిన గురుజు లక్ష్మి అంజన శుక్రవారం విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆమె తండ్రి భీమవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్‌లో రైటర్ కాగా, తల్లి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. తాను పనిచేస్తున్న పోలీస్ శాఖలో తమ కూతురు డీఎస్పీగా ఉద్యోగం పొందడం పట్ల లక్ష్మీ అంజన తల్లితండ్రుల అమితానందాన్ని వ్యక్తం చేశారు.