News November 8, 2024
భద్రాద్రి: డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల సంఘం లైబ్రరీ హాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి డిజిటల్ లైబ్రరీని కొత్తగూడెం బార్ అసోసియేషన్లో ప్రారంభించడం చాలా శుభపరిణామని, న్యాయవాదులు డిజిటల్ లైబ్రరీని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా తమ వృత్తి నైపుణ్యతను మెరుగుపరుచుకోవచ్చుననీ న్యాయమూర్తి తెలిపారు.
Similar News
News September 13, 2025
ఖమ్మం జిల్లాలో 15 నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల బంద్

ఖమ్మం జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటించనున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యులు మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బకాయిలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
News September 13, 2025
ఖమ్మం: కాంగ్రెస్లో వర్గపోరు.. పరస్పరం దాడులు

బోనకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రెండు వర్గాల నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఒక వ్యక్తి చెవి తెగిపోగా, మరొకరిని మహిళలు చెప్పులతో కొట్టి గాయపరిచారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 13, 2025
ఖమ్మం: పత్తి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ ఆదేశాలు

ఖమ్మం జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా మద్దతు ధరతో కొనుగోళ్లు జరగాలని అ.కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2,25,613 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 27,07,356 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. జిల్లాలో 5సిసిఐ కేంద్రాలు, 9 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.