News November 8, 2024

గీజర్ వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి!

image

చాలామంది గీజర్‌ను గంటల తరబడి ఆన్‌లోనే ఉంచుతారు. అది ఏమాత్రం మంచిదికాదు. ఒక్కోసారి గీజర్ ఓవర్ హీట్ ఎక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక గీజర్‌ను ఏడాదికోసారి సర్వీసింగ్ చేయించాలి. అప్పుడే ఏమైనా లీకేజీ ఉంటే తెలుస్తుంది. గీజర్ కనెక్షన్ వైర్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. చాలా ఏళ్లుగా వాడుతున్న పరికరాలను మార్చడం ఉత్తమం. వాటి వల్ల షార్ట్ సర్య్కూట్ వచ్చే ప్రమాదం ఉంది.

Similar News

News November 8, 2024

రూమ్‌లో కూర్చుంటే కుదరదు.. ప్రాక్టీస్ చేయండి: కపిల్ దేవ్

image

కివీస్‌ చేతిలో వైట్‌వాష్ తర్వాత BGT కోసం సిద్ధమవుతున్న టీమ్ ఇండియా ఆటగాళ్లకు లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక సూచనలు చేశారు. క్రికెట్ బేసిక్స్‌కు తిరిగివెళ్లి తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలన్నారు. ‘రూమ్‌లో కూర్చుని మెరుగవుతానని మీరనుకుంటే ఎప్పటికీ జరగదు. ప్రస్తుతం మీకు కష్టకాలం నడుస్తోంది. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి’ అని పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.

News November 8, 2024

మతం రాగం అందుకోవాల్సిందే.. సీపీఎం నిర్ణయం

image

కమ్యూనిస్టులు తమ రాజకీయ విధానంలో పెద్ద మార్పుకే శ్రీకారం చుట్టారు. మతం విషయంలో కొన్ని మినహాయింపులతో తీర్మాన ముసాయిదా పత్రాన్ని సీపీఐ(ఎం) అగ్రనాయకత్వం సిద్ధం చేసింది. మత ఆచరణ కలిగిన వారిని పార్టీలోకి చేర్చుకుని కలిసి పని చేయాలని నిర్ణయించింది. ఆర్ఎస్ఎస్ మాదిరిగానే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ప్రతిపాదించింది. అదే సమయంలో సోషలిజం సాధన, వామపక్షాల ఐక్యతను సాధించడాన్ని లక్ష్యంగా పేర్కొంది.

News November 8, 2024

మిడిల్ ఈస్ట్‌కు అమెరికా F-15 ఫైటర్ జెట్

image

ఇరాన్‌ను హెచ్చరించేందుకు అమెరికా తమ F-15 ఫైటర్ జెట్‌ను మిడిల్ ఈస్ట్‌కు పంపింది. ఈ విషయాన్ని యూఎస్ మిలిటరీ ధ్రువీకరించింది. ఇప్పటికే ఆ దేశం బాంబర్స్, ఫైటర్, ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్, బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ డెస్ట్రాయర్స్‌ను అక్కడికి పంపింది. తమకు గానీ, తమ మిత్ర దేశాలకు గానీ ఇరాన్ ఏమైనా హానీ చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని యూఎస్ హెచ్చరించింది.