News November 8, 2024
మార్స్‌పై అతి పురాతన మహాసముద్రం.. గుర్తించిన చైనా
అంగారకుడిపై కోటానుకోట్ల ఏళ్ల క్రితం మహాసముద్రం ఉండేదని చైనా పరిశోధకులు తేల్చిచెప్పారు. తాము పంపించిన ఝరాంగ్ రోవర్ అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించిందని వారు వెల్లడించారు. ‘మార్స్‌పై ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో నమూనాల ఆధారంగా పురాతన కాలంలో ఓ మహా సముద్రం ఉండేదని గుర్తించాం. సుమారు 3.42 సంవత్సరాల క్రితం ఆ సముద్రం ఎండిపోయింది. ఆ సమయంలో సూక్ష్మ జీవులు అక్కడ మనుగడ సాగించి ఉండొచ్చు’ అని తెలిపారు.
Similar News
News November 8, 2024
రూమ్‌లో కూర్చుంటే కుదరదు.. ప్రాక్టీస్ చేయండి: కపిల్ దేవ్
కివీస్ చేతిలో వైట్‌వాష్ తర్వాత BGT కోసం సిద్ధమవుతున్న టీమ్ ఇండియా ఆటగాళ్లకు లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక సూచనలు చేశారు. క్రికెట్ బేసిక్స్‌కు తిరిగివెళ్లి తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలన్నారు. ‘రూమ్‌లో కూర్చుని మెరుగవుతానని మీరనుకుంటే ఎప్పటికీ జరగదు. ప్రస్తుతం మీకు కష్టకాలం నడుస్తోంది. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి’ అని పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.
News November 8, 2024
మతం రాగం అందుకోవాల్సిందే.. సీపీఎం నిర్ణయం
కమ్యూనిస్టులు తమ రాజకీయ విధానంలో పెద్ద మార్పుకే శ్రీకారం చుట్టారు. మతం విషయంలో కొన్ని మినహాయింపులతో తీర్మాన ముసాయిదా పత్రాన్ని సీపీఐ(ఎం) అగ్రనాయకత్వం సిద్ధం చేసింది. మత ఆచరణ కలిగిన వారిని పార్టీలోకి చేర్చుకుని కలిసి పని చేయాలని నిర్ణయించింది. ఆర్ఎస్ఎస్ మాదిరిగానే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ప్రతిపాదించింది. అదే సమయంలో సోషలిజం సాధన, వామపక్షాల ఐక్యతను సాధించడాన్ని లక్ష్యంగా పేర్కొంది.
News November 8, 2024
మిడిల్ ఈస్ట్‌కు అమెరికా F-15 ఫైటర్ జెట్
ఇరాన్‌ను హెచ్చరించేందుకు అమెరికా తమ F-15 ఫైటర్ జెట్‌ను మిడిల్ ఈస్ట్‌కు పంపింది. ఈ విషయాన్ని యూఎస్ మిలిటరీ ధ్రువీకరించింది. ఇప్పటికే ఆ దేశం బాంబర్స్, ఫైటర్, ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్, బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ డెస్ట్రాయర్స్‌ను అక్కడికి పంపింది. తమకు గానీ, తమ మిత్ర దేశాలకు గానీ ఇరాన్ ఏమైనా హానీ చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని యూఎస్ హెచ్చరించింది.