News November 8, 2024

గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే

image

పండుగ సీజన్ కావడంతో గత నెలలో భారత వాహన మార్కెట్ మంచి అమ్మకాల్ని నమోదు చేసింది. అత్యధికంగా మారుతీ ఎర్టిగా కారు 18,785 యూనిట్లను విక్రయించింది. 2023 అక్టోబరుతో పోలిస్తే ఇది 32 శాతం వృద్ధి. తర్వాతి స్థానాల్లో స్విఫ్ట్(17,539), క్రెటా(17,497), బ్రెజా(16,565), మారుతీ సుజుకీ ఫ్రాంక్స్(16,419), బలేనో(16,082), టాటా పంచ్(15,470), స్కార్పియో(15,677), టాటా నెక్సాన్(14,759), గ్రాండ్ విటారా(14,083) ఉన్నాయి.

Similar News

News February 12, 2026

52 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 52 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి ఇంటర్, BSc, MSc(ఫారెస్ట్రీ, అగ్రోఫారెస్ట్రీ, బోటనీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్), PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. ప్రాజెక్ట్ అసోసియేట్‌కు FEB 19న, JPF, JRFకు FEB 20న, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు FEB 23న, ఫీల్డ్ అసిస్టెంట్‌కు FEB 24న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://fri.icfre.gov.in

News February 12, 2026

అతిగా ఆలోచిస్తున్నారా?

image

సాధారణంగా రాత్రుళ్లు మెదడులో తార్కికంగా పనిచేసే భాగం విశ్రాంతిలోకి వెళుతుంది. దీంతో భావోద్వేగాలు మన ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, భవిష్యత్‌ గురించి ఆలోచించడానికి అది సరైన సమయం కాదు. ఏదైనా పనిచేశాక ఫలితాన్ని దానికే వదిలెయ్యాలి. వరుస వైఫల్యాలు ఎదురవుతోంటే మనసు గాయపడి ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. కానీ వాటిని పక్కనపెట్టి తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఎలా విజయం సాధించవచ్చని ఆలోచించండి.

News February 12, 2026

ఇండియన్స్‌ను టార్చర్ చేస్తూ వీడియో కాల్స్.. ఎలా బయటపడ్డారంటే?

image

USకు వెళ్లే క్రమంలో గుజరాత్‌కు చెందిన ధ్రువ్(22), దీపిక(32) నరకాన్ని చూశారు. ఏజెంట్ వీరి నుంచి ₹50L తీసుకుని <<15379310>>‘డంకీ రూట్‌’<<>>లో US చేరుస్తానన్నారు. అయితే వారు అజర్‌బైజాన్‌లో కిడ్నాప్‌కు గురయ్యారు. దుండగులు వారిని టార్చర్ చేసి, అవయవాలు అమ్మేస్తామని ఫ్యామిలీకి వీడియో కాల్స్ చేయడంతో ₹65Lను పంపారు. మళ్లీ బెదిరించడంతో విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఆశ్రయించగా, ఆయన దౌత్యపరమైన ఒత్తిడితో వారిని విడిపించారు.