News November 8, 2024

బడి బయట 10వేల మంది: కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో బడిబయట ఉన్న పిల్లలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో విద్యార్థి వారీగా నివేదిక రూపొందించాల‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ విద్యాశాఖ అధికారుల‌ను ఆదేశించారు. విద్యాశాఖాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న విద్యార్థుల సంఖ్య దృష్ట్యా సుమారు ప‌దివేల మంది బడి బయట ఉండవచ్చని డీఈఓ తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వారిపై అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశించారు.

Similar News

News July 10, 2025

నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా పెట్టాలి: SP

image

నేరాల నియంత్రణకు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు శక్తి యాప్‌పై అవగాహన చేపట్టాలన్నారు. విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించేందుకు శక్తి వారియర్స్ టీమ్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు.

News July 9, 2025

గ్రంథాల‌యాల అభివృద్దికి చ‌ర్య‌లు: జేసీ

image

జిల్లాలో గ్రంథాల‌యాల అభివృద్దికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జేసీ, జిల్లా గ్రంథాల‌య సంస్థ ఇన్‌ఛార్జ్ ఎస్‌.సేతు మాధ‌వ‌న్ ఆదేశించారు. జిల్లా గ్రంథాల‌య సంస్థ బ‌డ్జెట్‌ స‌మావేశం జేసీ ఛాంబ‌ర్‌లో బుధవారం జ‌రిగింది. పౌర గ్రంథాల‌యశాఖ డైరెక్ట‌ర్ సూచ‌న‌లు, కేటాయించిన బ‌డ్జెట్‌కు అనుగుణంగా, త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స‌ర్వ‌స‌భ్య స‌మావేశం గురించి, ప్ర‌స్తుత ఆర్థికసంవ‌త్స‌రంలో చర్యలు గురించి చర్చించారు.

News July 9, 2025

జరజాపుపేట యువకుడిపై పోక్సో కేసు నమోదు: ఎస్‌ఐ

image

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటకు చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గణేశ్ బుధవారం తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసినట్లు చెప్పారు. బాలిక ఫిర్యాతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.