News November 8, 2024
ఓటీటీలోకి వచ్చేసిన ‘దేవర’
ఓటీటీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ నెట్‌ఫ్లిక్స్‌లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. త్వరలోనే హిందీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. కొరటాల శివ డైరెక్షన్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా రూ.500కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే.
Similar News
News November 8, 2024
తన స్నేహితుడిలా మరెవరికీ జరగొద్దని..!
దేశంలో ఏటా 1.50లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. వీరిలో ఆస్పత్రికి వెళ్లడం లేటవడంతోనే చాలామంది మరణిస్తున్నారు. అలా చనిపోయిన వారిలో దినేశ్ ఒకరు. తన మిత్రుడిలా ఎవరూ చనిపోవద్దని వివేక్ అనే వ్యక్తి ఓ పరికరం కనుగొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటో మెటిక్‌గా ట్రిగ్గర్ అయ్యే రక్షణ వ్యవస్థను తయారు చేశారు. ఇది ప్రమాద లోకేషన్ ఆధారంగా ఎమర్జెన్సీ సేవలకు సమాచారం ఇస్తుంది. ఇదంతా 3ని.లలోపే జరుగుతుంది.
News November 8, 2024
ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్
AP: ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది’ అని ఆయన పేర్కొన్నారు.
News November 8, 2024
నోట్ల రద్దుకు 8 ఏళ్లు
కేంద్రం పెద్ద నోట్ల రద్దును ప్రకటించి 8 ఏళ్లు పూర్తవుతోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా కొత్త రూ.500, రూ.2000 నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ‘ATMల వద్ద రూ.2వేల కోసం క్యూ కట్టేవాళ్లం. మా వరకు వచ్చేసరికి ATM ఖాళీ అయ్యేది. స్కూల్ ఫీజుల కోసం రెండు మూడు సార్లు లైన్‌లో నిల్చునేవాళ్లం’ అని ట్వీట్స్ చేస్తున్నారు.