News November 8, 2024
DEC 18 నుంచి డిపార్ట్‌మెంటల్ టెస్టులు
AP: ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వచ్చే నెల 3 వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 18 నుంచి 23 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం <
Similar News
News November 8, 2024
జగన్ తన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని బయట పెడుతున్నారు: జీవీ
APలో నేరాలు తగ్గి శాంతి నెలకొనాలంటే జగన్‌నే అరెస్ట్ చేయాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వ్యాఖ్యానించారు. డీజీపీని బెదిరించడం చూస్తుంటే జగన్ తన క్రిమినల్, ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటున్నారని అన్నారు. రౌడీలను రెచ్చగొడుతూ రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీ షీటర్లు, హంతకులను జైళ్లకు పంపిస్తే YCP దాదాపు ఖాళీ అవుతుందని చెప్పారు.
News November 8, 2024
AMUపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
UPలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(AMU)పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం AMUకి మైనార్టీ హోదా కొనసాగించవచ్చని CJI చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 4:3తో తీర్పు ఇచ్చింది. రెగ్యులర్ బెంచ్ ఈ అంశంపై తుది తీర్పు ఇస్తుందని పేర్కొంది. 1875లో ప్రారంభించిన ఈ సంస్థ 1920లో సెంట్రల్ యూనివర్సిటీగా మారగా, ఆ తర్వాత 1951లో ముస్లిం యూనివర్సిటీగా రూపాంతరం చెందింది.
News November 8, 2024
సీ ప్లేన్‌లో చంద్రబాబు శ్రీశైలం పర్యటన
AP: సీఎం చంద్రబాబు రేపు సీ ప్లేన్‌లో శ్రీశైలం పర్యటనకు వెళ్లనున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో టేకాఫ్ తీసుకుని శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత మల్లన్న ఆలయానికి చేరుకుని భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. కాగా తిరుమల తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించనున్నారు.