News November 8, 2024

నిస్సాన్‌లో 9,000 మందికి లేఆఫ్స్

image

జపాన్‌లో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘నిస్సాన్’ భారీగా లేఆఫ్స్‌కు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో యూరప్‌లోనే 4,700 జాబ్స్ ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కార్ల ఉత్పత్తిని 20% తగ్గిస్తామని తెలిపింది. నిస్సాన్ వార్షికాదాయ అంచనాను 70 శాతం($975 మిలియన్) కుదించింది. తాము తీసుకునే చర్యలతో మళ్లీ పుంజుకుంటామని CEO మకోటో ఉచిద ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News November 8, 2024

నోట్ల రద్దుకు 8 ఏళ్లు

image

కేంద్రం పెద్ద నోట్ల రద్దును ప్రకటించి 8 ఏళ్లు పూర్తవుతోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా కొత్త రూ.500, రూ.2000 నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ‘ATMల వద్ద రూ.2వేల కోసం క్యూ కట్టేవాళ్లం. మా వరకు వచ్చేసరికి ATM ఖాళీ అయ్యేది. స్కూల్ ఫీజుల కోసం రెండు మూడు సార్లు లైన్‌లో నిల్చునేవాళ్లం’ అని ట్వీట్స్ చేస్తున్నారు.

News November 8, 2024

Review: నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’

image

కథ ఫర్వాలేదు అనుకున్నా, దర్శకుడు సుధీర్ వర్మ తెరపై ఆ స్థాయిలో చూపలేకపోయారు. ఫస్టాఫ్ బోరింగ్‌గా సాగితే సెకండాఫ్‌లో సస్పెన్స్ రివీల్‌లో తేడా కొట్టింది. పాత్రలనూ సరిగ్గా ప్లాన్ చేయలేదు. కొన్నిచోట్ల నవ్వుకోదగ్గ కామెడీ సీన్లుంటాయి. నిఖిల్ సహా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రొడక్షన్ వర్క్స్ కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి.
రేటింగ్: 1.5/5

News November 8, 2024

తిరుమలను UTగా చేయాలన్న కేఏ పాల్ పిటిషన్ డిస్మిస్

image

AP: లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని KA పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ అంశంలో రాజకీయం నడుస్తోందని, దేశ ప్రతిష్ఠను కాపాడటానికి పిల్ వేశానని పాల్ పేర్కొన్నారు. దీనిప్రకారం అన్ని ఆలయాలు, గురుద్వారాలను ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాల్సి ఉంటుందని బెంచ్ అభిప్రాయపడింది. ప్రస్తుతం సిట్ విచారణకు ఆదేశించామని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టేసింది.