News November 8, 2024
‘వైట్‌హౌస్’ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా మహిళను నియమించిన ట్రంప్

అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ పదవుల భర్తీపై దృష్టి పెట్టారు. తాజాగా ‘వైట్‌హౌస్’ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ వైల్స్‌ను నియమించారు. ఓ మహిళ ఈ బాధ్యతలు చేపట్టడం వైట్‌హౌస్ చరిత్రలో ఇదే తొలిసారి. ట్రంప్ విజయంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ‘సూసీ ఎంతో తెలివైనవారు. వినూత్నంగా ఆలోచిస్తారు. అమెరికాను మరోసారి ఉన్నత స్థానంలో నిలపడానికి ఆమె శక్తివంచన లేకుండా పనిచేస్తారు’ అని ట్రంప్ ప్రశంసలు కురిపించారు.
Similar News
News September 14, 2025
నేడు మళ్లీ చర్చలు.. విఫలమైతే కాలేజీలు బంద్

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్(FATHI) రేపటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీల <<17690252>>బంద్‌కు<<>> పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిధుల విడుదలపై నిన్న Dy.CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబుతో FATHI జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇవాళ మరోసారి మీటింగ్ జరగనుంది. సయోధ్య కుదరకపోతే రేపటి నుంచి ప్రొఫెషనల్ కాలేజీలు, 16 నుంచి డిగ్రీ, PG కాలేజీలు బంద్ చేసే అవకాశముంది.
News September 14, 2025
మైథాలజీ క్విజ్ – 5

1. 8 దిక్కులు మనకు తెలుసు. మరి 10 దిశల్లో మరో రెండు దిశలు ఏవి?
2. గోదావరి నది ఏ జ్యోతిర్లింగ క్షేత్ర సమీపంలో జన్మించింది?
3. వసంత పంచమి ఏ తెలుగు మాసంలో వస్తుంది?
4. అంబ ఎవరిపై ప్రతీకారం తీర్చుకునేందుకు శిఖండిగా పుట్టింది?
5. జనకుడికి నాగలి చాలులో ఎవరు కనిపించారు? (సరైన సమాధానాలను రేపు 7AM పబ్లిష్ చేస్తాం.)
– <<17690127>>మైథాలజీ క్విజ్-4<<>> ఆన్సర్స్: 1.శివుడు 2.రావణుడు 3.కేరళ 4.పూరీ జగన్నాథ ఆలయం 5.వరాహ అవతారం
News September 14, 2025
ఇంట్లో గడియారం ఏ దిక్కున ఉండాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. గడియారాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇది ఇంట్లో సానుకూలత, శాంతిని పెంచుతుందని అంటున్నారు. ‘దక్షిణ దిశలో గడియారం ఉంచడం అశుభం. ఇది పురోగతిని అడ్డుకుంటుంది. అలాగే విరిగిన లేదా ఆగిపోయిన గడియారాలను ఇంట్లో ఉంచకూడదు. గడియారాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు’ అని సూచిస్తున్నారు.