News November 8, 2024
మిడిల్ ఈస్ట్‌కు అమెరికా F-15 ఫైటర్ జెట్
ఇరాన్‌ను హెచ్చరించేందుకు అమెరికా తమ F-15 ఫైటర్ జెట్‌ను మిడిల్ ఈస్ట్‌కు పంపింది. ఈ విషయాన్ని యూఎస్ మిలిటరీ ధ్రువీకరించింది. ఇప్పటికే ఆ దేశం బాంబర్స్, ఫైటర్, ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్, బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ డెస్ట్రాయర్స్‌ను అక్కడికి పంపింది. తమకు గానీ, తమ మిత్ర దేశాలకు గానీ ఇరాన్ ఏమైనా హానీ చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని యూఎస్ హెచ్చరించింది.
Similar News
News November 8, 2024
మళ్లీ ‘అమ్మ’ అధ్యక్ష బాధ్యతలు చేపట్టను : మోహన్ లాల్
మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(AMMA) అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపడతారన్న వార్తలను హీరో మోహన్ లాల్ కొట్టిపారేశారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. అవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో నటీమణులపై వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సంచలన విషయాలు బయట పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అమ్మ అధ్యక్షుడు మోహన్ లాల్ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన రిజైన్ చేశారు.
News November 8, 2024
రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ: మంత్రి అచ్చెన్న
AP: వైసీపీ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పుడు ఎలాంటి నిబంధనల అడ్డు లేకుండా రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. పంటను కొనుగోలు చేసిన 48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమచేస్తామని పునరుద్ఘాటించారు. రైతుల నుంచి ప్రతి గింజా కొంటామని స్పష్టం చేశారు.
News November 8, 2024
IPL: ఈ ఆరుగురిపై పంజాబ్ కన్ను?
పంజాబ్ కింగ్స్ పర్సులో అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. దీంతో వేలంలో ఆ జట్టు ఏ ఆటగాడిని కొనడానికైనా వెనకాడదని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రిషభ్ పంత్ కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమైనట్లు టాక్. అలాగే శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ, కగిసో రబాడ, లియామ్ లివింగ్‌స్టోన్ కోసం భారీగా ఖర్చు చేస్తుందని సమాచారం. ఈ ఆరుగురు ఆటగాళ్లను కచ్చితంగా దక్కించుకుంటుందని తెలుస్తోంది.