News November 8, 2024
మతం రాగం అందుకోవాల్సిందే.. సీపీఎం నిర్ణయం
కమ్యూనిస్టులు తమ రాజకీయ విధానంలో పెద్ద మార్పుకే శ్రీకారం చుట్టారు. మతం విషయంలో కొన్ని మినహాయింపులతో తీర్మాన ముసాయిదా పత్రాన్ని సీపీఐ(ఎం) అగ్రనాయకత్వం సిద్ధం చేసింది. మత ఆచరణ కలిగిన వారిని పార్టీలోకి చేర్చుకుని కలిసి పని చేయాలని నిర్ణయించింది. ఆర్ఎస్ఎస్ మాదిరిగానే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ప్రతిపాదించింది. అదే సమయంలో సోషలిజం సాధన, వామపక్షాల ఐక్యతను సాధించడాన్ని లక్ష్యంగా పేర్కొంది.
Similar News
News November 8, 2024
ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్
AP: ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది’ అని ఆయన పేర్కొన్నారు.
News November 8, 2024
నోట్ల రద్దుకు 8 ఏళ్లు
కేంద్రం పెద్ద నోట్ల రద్దును ప్రకటించి 8 ఏళ్లు పూర్తవుతోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా కొత్త రూ.500, రూ.2000 నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ‘ATMల వద్ద రూ.2వేల కోసం క్యూ కట్టేవాళ్లం. మా వరకు వచ్చేసరికి ATM ఖాళీ అయ్యేది. స్కూల్ ఫీజుల కోసం రెండు మూడు సార్లు లైన్లో నిల్చునేవాళ్లం’ అని ట్వీట్స్ చేస్తున్నారు.
News November 8, 2024
Review: నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’
కథ ఫర్వాలేదు అనుకున్నా, దర్శకుడు సుధీర్ వర్మ తెరపై ఆ స్థాయిలో చూపలేకపోయారు. ఫస్టాఫ్ బోరింగ్‌గా సాగితే సెకండాఫ్‌లో సస్పెన్స్ రివీల్‌లో తేడా కొట్టింది. పాత్రలనూ సరిగ్గా ప్లాన్ చేయలేదు. కొన్నిచోట్ల నవ్వుకోదగ్గ కామెడీ సీన్లుంటాయి. నిఖిల్ సహా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రొడక్షన్ వర్క్స్ కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి.
రేటింగ్: 1.5/5