News November 8, 2024
నేడే భారత్, సౌతాఫ్రికా తొలి టీ20.. లైవ్ ఎందులో అంటే?

నాలుగు T20ల సిరీస్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య నేడు తొలి మ్యాచ్ జరగనుంది. డర్బన్ వేదికగా రా.8.30 గంటలకు పోరు మొదలుకానుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో లైవ్ చూడొచ్చు. టెస్ట్ సిరీస్‌లో కివీస్ చేతిలో ఎదురైన దారుణ పరాభవాన్ని మరిపించాలని సూర్య నేతృత్వంలోని కుర్రాళ్లు భావిస్తున్నారు. T20 WC ఫైనల్లో భారత్ చేతిలో ఓటమికి ఈ సిరీస్ ద్వారా కొంతైనా ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీ జట్టు ఉవ్విళ్లూరుతోంది.
Similar News
News November 2, 2025
20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు: శ్రీధర్ బాబు

TG: ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 20 నెలల వ్యవధిలోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. BRS పాలనలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే… మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్‌లో మంత్రి ప్రచారం నిర్వహించారు.
News November 2, 2025
NHలపై ప్రమాదాలు.. కాంట్రాక్టర్లకు భారీ ఫైన్లు

నేషనల్ హైవేలపై ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని 500M పరిధిలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్‌కు ₹25L, మరుసటి ఏడాదీ యాక్సిడెంట్ జరిగితే ₹50L ఫైన్ విధించనుంది. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్(BOT) విధానంలో నిర్మించే రోడ్లకు దీన్ని వర్తింపజేస్తామని, ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదేనని ఓ అధికారి వెల్లడించారు.
News November 2, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలోని కర్నూలు, తిరుపతి జిల్లాల్లో రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.


