News November 8, 2024
BIG ALERT: ఇలా కుటుంబ వివరాలిస్తున్నారా?

TG: సమగ్ర కుటుంబ సర్వే కోసం ఫోన్ చేస్తున్నామంటూ సైబర్ నేరగాళ్లు ప్రమాదకర లింకులు, ఏపీకే ఫైల్స్ పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని క్లిక్ చేయగానే పౌరుల వ్యక్తిగత సమాచారం వారికి చేరుతోంది. అకౌంట్లలో డబ్బులు ఖాళీ అవుతున్నాయి. కాగా సర్వే సిబ్బంది నేరుగా ఇంటికే వస్తారని, ఎలాంటి పత్రాలు తీసుకోరనే విషయం గుర్తుంచుకోండి. సర్వే పేరిట అనుమానాస్పద లింకులు వస్తే 1930కి కాల్ చేయాలని పోలీసులు తెలిపారు.
Similar News
News January 14, 2026
రేపు భోగి.. ఏం చేస్తారంటే?

తెలుగు ప్రజలకు అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగలో తొలి రోజును భోగిగా పిలుస్తారు. ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పనికి రాని, పాత చెక్కవస్తువులతో భోగి మంటలు వేస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేయడంతో పాటు ఇంటిని శుద్ధి చేసి పిండి వంటలు చేసుకొని తింటారు. దానం చేస్తారు. సాయంత్రం చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. కొందరు తమ ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు.
News January 14, 2026
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబై విజయం

WPL-2026లో గుజరాత్‌తో జరిగిన మ్యాచులో ముంబై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్(71*) అర్ధసెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చారు. <<18849934>>193<<>> పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కమలిని(13), మాథ్యూస్(22) విఫలమయ్యారు. ఆ తర్వాత అమన్‌జోత్(40)తో కలిసి హర్మన్ 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తర్వాత వచ్చిన కేరీ(38*) మెరుపులు తోడవ్వడంతో ముంబై ఈ సీజన్‌లో రెండో విజయం నమోదు చేసింది. గుజరాత్‌కు ఇది తొలి ఓటమి.
News January 14, 2026
అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించేందుకు AI టూల్: MH సీఎం

అక్రమ బంగ్లాదేశీయుల అంశం ప్రధాన సమస్య అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. వారిని గుర్తించేందుకు IIT బాంబేతో కలిసి AI టూల్‌ను తాము అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్క్ కొనసాగుతోందని, AI టూల్ సక్సెస్ రేటు 60 శాతంగా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా ముంబైకి వచ్చిన బంగ్లా పౌరులను పంపించేందుకు డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా ఇది కొనసాగుతుందని చెప్పారు.


