News November 8, 2024
పవన్ కళ్యాణ్‌కు జీవోలతో వైసీపీ కౌంటర్

AP: వాలంటీర్లు వ్యవస్థలోనే లేరని, జీవోల్లో వారి ప్రస్తావన లేదన్న Dy.cm పవన్ కళ్యాణ్‌కు YCP కౌంటర్ ఇచ్చింది. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన జీవోలు, వారి నియామక, జీతాల ఉత్తర్వులను Xలో పోస్టు చేసింది. ‘మీరు డిప్యూటీ సీఎంగా ఎలా కొనసాగుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. వాలంటీర్లకు సంబంధించి ఇన్ని జీవోలు ఇచ్చి నియామకాలు చేస్తే అజ్ఞానపు మాటలతో మీ పరువు మీరే తీసుకుంటున్నారు’ అని ఎద్దేవా చేసింది.
Similar News
News February 20, 2026
ఆయేషా మీరా హత్య కేసులో కీలక ఆదేశాలు

AP: ఆయేషా మీరా హత్య కేసులో వైద్య బృందం సేకరించిన అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని VJA సీబీఐ కోర్టు పేర్కొంది. FEB 27న తెనాలిలో మతపరమైన ఆచారాలతో అంత్యక్రియలు చేయాలని, అందుకు వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రీపోస్ట్‌మార్టం కోసం 2019లో తెనాలి కబరిస్తాన్ నుంచి ఆయేషా అవశేషాలను సేకరించారు. 2007లో విజయవాడ శివార్లలోని ఓ బీఫార్మసీ కాలేజ్ హాస్టల్లో ఆయేషా హత్యకు గురైన విషయం తెలిసిందే.
News February 20, 2026
ట్రంప్ టారిఫ్స్ దందా రివర్స్.. మన పరిస్థితి ఏంటి?

US అధ్యక్షుడు ట్రంప్ ఇన్నాళ్లూ ఆడిన టారిఫ్ గేమ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పుతో చెక్ పడినట్లు అయింది. అయితే టారిఫ్స్‌కు బెదిరి డీల్స్ కుదుర్చుకున్న దేశాల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. భారత్ కూడా ఇటీవల డీల్ కుదుర్చుకుంది. మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఆ ట్రేడ్ డీల్‌పై పడుతుందా అనేది బిగ్ క్వశ్చన్. మారిన పరిణామాల నేపథ్యంలో భారత్ ఈ డీల్‌పై వెనక్కి తగ్గే అవకాశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.
News February 20, 2026
రేపు వేంకటేశ్వరుడి ఆలయాల్లో కూటమి శ్రేణుల పూజలు

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇవాళ మండలికి YCP నేతలు శ్రీవారి ఫొటోలను తేవడంపై కూటమి నేతలు తీవ్రంగా పరిగణించారు. దేవుడికి అపచారం జరిగిందంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని జూమ్ కాన్ఫరెన్సులో నిర్ణయించారు. రేపు వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో పూజలతో పాటు సంప్రోక్షణ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అటు మఠాధిపతులు, స్వామీజీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.


