News November 8, 2024

DSC ఎంపికలో లోపాలు.. ఏడుగురు తొలగింపు

image

TG: DSC-2024లో ఎంపికైన ఏడుగురు హిందీ పండిట్‌లను ఖమ్మం జిల్లాలో తొలగించడం కలకలం రేపుతోంది. 1:3 నిష్పత్తిలో అర్హత సాధించిన వారిలో కొందరికి అర్హత లేదని ఫిర్యాదు అందగా, వెరిఫికేషన్‌లో క్లీన్‌చిట్ వచ్చింది. 20 రోజులు ఉద్యోగం కూడా చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఎంపిక కాని అభ్యర్థులు కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేయగా, డిగ్రీలో ప్రత్యేక సబ్జెక్టుగా హిందీ లేదని విచారణలో బయటపడింది. దీంతో వారిని తొలగించారు.

Similar News

News November 8, 2024

కారులో 20లక్షల కిలోమీటర్లు ప్రయాణం!

image

ఏదైనా ఓ కారు దాదాపు 10 లక్షల కిలోమీటర్ల వరకూ ప్రయాణించడమే గొప్ప. కానీ 1993 మోడల్ టయోటా కంపెనీకి చెందిన కరోలా కారును ఓ 72 ఏళ్ల గ్రేమ్ హెబ్లీ ఏకంగా 20 లక్షల కిలోమీటర్లు నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2000 సంవత్సరంలో 80వేలు తిరిగిన హెబ్లీ కరోలా కారును కొనుగోలు చేశారు. ఇప్పటివరకు 20లక్షల కిలోమీటర్లను కంప్లీట్ చేశారు. ఇప్పటికీ ఎలాంటి సమస్యలేకుండా కారు నడుస్తోందని ఆయన తెలిపారు.

News November 8, 2024

విజయమ్మ, షర్మిలపై జగన్ పిటిషన్.. విచారణ వాయిదా

image

AP: విజయమ్మ, షర్మిలతో ఆస్తుల వివాదంపై జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో విచారణ జరిగింది. తనకు తెలియకుండా తల్లి, చెల్లి షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట షేర్లు కొనసాగేలా చూడాలని కోరారు. కౌంటర్ దాఖలకు విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో విచారణను వచ్చే నెల 13కు ఎన్‌సీఎల్‌టీ వాయిదా వేసింది.

News November 8, 2024

మళ్లీ ‘అమ్మ’ అధ్యక్ష బాధ్యతలు చేపట్టను : మోహన్ లాల్

image

మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(AMMA) అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపడతారన్న వార్తలను హీరో మోహన్ లాల్ కొట్టిపారేశారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. అవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో నటీమణులపై వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సంచలన విషయాలు బయట పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అమ్మ అధ్యక్షుడు మోహన్ లాల్ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన రిజైన్ చేశారు.