News November 8, 2024
US అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి గ్యాప్.. ఎందుకంటే?
అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 20వ రాజ్యాంగ సవరణ ద్వారా గతంలో మార్చి 4గా ఉన్న ఈ తేదీని JAN 20కి మార్చారు. కాగా ఈ 2నెలలకు పైగా కాలంలో ప్రభుత్వ మార్పిడికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. మంత్రులు, కీలక స్థానాల్లో ఉండే వారిని ఖరారు చేసుకుంటారు. DEC 17న ఎలక్టోరల్ కాలేజీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. JAN 6న ప్రతినిధుల సభ, సెనెట్ ట్రంప్ ఎన్నికను ఆమోదిస్తుంది.
Similar News
News November 8, 2024
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట.. సీఎం రేవంత్ ఆదేశం
TG: యాదాద్రి ఆలయం పేరును మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై రికార్డుల్లో ఇదే కొనసాగించాలని సూచించారు. ఇక టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై జరిపిన సమీక్షలో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
News November 8, 2024
ఇంట్లో ఈ మొక్కలుంటే ఆరోగ్యమే!
గాలిని శుద్ధిచేసి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించే మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ఎంతో శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్పైడర్ ప్లాంట్ ఇంట్లోని కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ & జిలీన్‌లను పీల్చుకుని గాలిని శుద్ధి చేసి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఇవి సురక్షితమైనవని చెప్పారు. బెస్ట్ బెడ్‌రూమ్ మొక్కలివే.. లావెండర్, అలోవెరా, జాస్మిన్, స్నేక్ ప్లాంట్, ఇంగ్లీష్ IVY.
News November 8, 2024
మహిళల బట్టలు పురుషులు కుట్టకూడదు: మహిళా కమిషన్
మహిళల దుస్తులు పురుషులు కుట్టకూడదని, ఇది బ్యాడ్ టచ్ కిందకే వస్తుందని UP మహిళా కమిషన్ తెలిపింది. స్త్రీల దుస్తుల కొలతలు స్త్రీలు మాత్రమే తీసుకోవాలని, టైలరింగ్ షాపులో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మహిళల శిరోజాలనూ పురుషులు కత్తిరించకుండా, స్త్రీలే కత్తిరించేలా చర్యలు తీసుకోవాలని UP ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బ్యాడ్ టచ్ నుంచి మహిళలను రక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.