News November 8, 2024
SOCIAL MEDIA: అభిమానం.. హద్దులు దాటొద్దు
రాజకీయాలకు సంబంధించి విమర్శలు, ప్రతివిమర్శలకు సోషల్ మీడియా కీలకంగా మారింది. ఏ పార్టీ వారైనా కొందరు మాత్రం పెచ్చుమీరి పోస్టులు పెడుతున్నారన్నది వాస్తవం. అసభ్య పదజాలంతో ఆడవాళ్లను దూషిస్తున్న తీరు జుగుప్సాకరం. పార్టీ, నాయకుడిపై ఉన్న అభిమానం పరిధి దాటి వ్యక్తిత్వ హననానికి దారి తీస్తోంది. దీనిని కట్టడి చేయాల్సిందే. అయితే ఎవరికివారు విచక్షణతో తమ భావాలను వ్యక్తీకరించడం ఉత్తమమని గుర్తించాలి. మీరేమంటారు?
Similar News
News November 8, 2024
మా సినిమా ట్రైలర్ లాక్ అయింది: పుష్ప టీమ్
పుష్ప-2 సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. రిలీజ్ ట్రైలర్‌ను లాక్ చేసినట్లు ప్రకటించింది. ‘ఎదురుచూపులు ముగిశాయి. ది రూల్ టేక్స్ ఓవర్. త్వరలో ట్రైలర్ అనౌన్స్‌మెట్’ అని ట్వీట్ చేసింది. వచ్చే నెల 5న పుష్ప: ది రూల్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.
News November 8, 2024
రంజీల్లో ఆడటం వృథానేనా?: హర్భజన్
రంజీల్లో 6000 రన్స్, 400 వికెట్స్ తీసిన తొలి క్రికెటర్‌గా కేరళ ప్లేయర్ జలజ్ సక్సేనా చరిత్ర సృష్టించారు. అయితే దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నా అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయట్లేదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ హర్భజన్ ‘అతడిని ఇండియా-Aకైనా ఎంపిక చేయాల్సింది. రంజీల్లో ఆడటం వృథానేనా? ప్లేయర్లు IPL నుంచే ఎంపికవుతున్నారు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
News November 8, 2024
ఏ వయసులో స్మోకింగ్ మానేసినా ప్రయోజనాలుంటాయ్
దశాబ్దాల పాటు స్మోకింగ్ చేసి లేటు వయసులో మానేయడం వల్ల ఉపయోగం లేదనే కొందరి వాదన తప్పు అని నిపుణులు చెబుతున్నారు. ఎంత పొగతాగేవారైనా, ఏ వయసులోనైనా దాన్ని వదిలేస్తే ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చంటున్నారు. ‘1-2ఏళ్లు మానేస్తే గుండె వ్యాధులు, 5-10ఏళ్ల తర్వాత క్యాన్సర్ ముప్పు సగానికి తగ్గుతుంది. రోగనిరోధక వ్యవస్థ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి’ అని పేర్కొంటున్నారు.