News November 8, 2024
ప్రజల మద్దతుంటే అరెస్టులెందుకు..?: హరీశ్ రావు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు లింగయ్య, భూపాలె రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అరెస్టులను ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. హౌస్ అరెస్టులు చేసి చేపట్టే పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు లభించదన్నారు. మూసీ మురికికి 50ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కాదా అని ప్రశ్నించారు. పాదయాత్రకు ప్రజల మద్దతు ఉంటే అక్రమ అరెస్టులెందుకుని.. దమ్ముంటే పేదల ఇళ్లు కూల్చిన హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.
Similar News
News November 10, 2025
నల్గొండ: ధాన్యం కొనుగోలుపై మంత్రుల సమీక్ష

ఖరీఫ్ ధాన్యం సేకరణ పురోగతిపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. నల్గొండ జిల్లాలో రైతులకు ఇప్పటివరకు రూ.160 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు. తడిసిన 4,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొన్నారని వివరించారు. పత్తి కొనుగోళ్ల కోసం అదనంగా తేమ కొలిచే యంత్రాల కొనుగోలుకు మంత్రి తుమ్మల ఆదేశించారు.
News November 10, 2025
NLG: ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి పెట్టండి: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కారం కావాలని, ఏ ఒక్క దరఖాస్తును కూడా పెండింగ్‌లో ఉంచవద్దని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
News November 10, 2025
NLG: ర్యాగింగ్‌పై ఉక్కుపాదం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

ర్యాగింగ్ అనే విష సంస్కృతికి విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడి తోటి విద్యార్థుల జీవితాలను నాశనం చేయవద్దని, అలా చేస్తే, ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ కింద 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.


