News November 8, 2024
ఆంధ్రా కాంట్రాక్టర్‌కు గులాంగిరీ చేస్తున్నావా?: KTR

TG: CM రేవంత్ రెడ్డిపై KTR తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘నా అరెస్టు కోసం రేవంత్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. మేఘా కృష్ణా రెడ్డిని సుంకిశాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చేయడానికి దమ్ముందా? అరెస్ట్ చెయ్యడానికి దమ్ముందా? ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్’ని, తన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి తీసివేసే దమ్ముందా? లేదా? CM అయ్యుండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా?’ అని ఆయన ప్రశ్నించారు.
Similar News
News July 5, 2025
B2 బాంబర్స్‌తో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

249వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అమెరికా వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా B2 స్టెల్త్ బాంబర్స్ వైట్‌హౌస్ మీదుగా దూసుకెళ్లాయి. వాటికి బాల్కనీ నుంచి సతీమణి మెలానియాతో పాటు ట్రంప్ సెల్యూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైట్‌హౌస్ Xలో పోస్ట్ చేసింది. కాగా ఇటీవల ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా ఆర్మీ ఈ B2 బాంబర్స్‌తోనే దాడి చేసింది.
News July 5, 2025
ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవ్వాలంటే..

చాలామంది ఉదయాన్నే మోషన్ అవ్వక అవస్థలు పడతారు. బలవంతంగా వెళ్లేందుకు కష్టపడుతుంటారు. అయితే పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగితే కండరాలు వ్యాకోచించి ఫ్రీగా మోషన్ అవుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక నిత్యం జీర్ణక్రియ సక్రమంగా పనిచేయాలంటే ఫైబర్ అధికంగా ఉండే యాపిల్స్, క్యారెట్, దుంపలు, బఠానీ, బీన్స్, ఓట్స్ తీసుకోవడంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.
News July 5, 2025
9న క్యాబినెట్ సమావేశం

AP క్యాబినెట్ సమావేశం ఈ నెల 9న జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను జులై 7లోగా పంపాలని అన్ని శాఖలను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. అన్నదాత-సుఖీభవ, అమరావతిలో అభివృద్ధి పనులు, పోలవరం, విశాఖలో ఐటీ కంపెనీల ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.