News November 8, 2024
AMUపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

UPలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(AMU)పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం AMUకి మైనార్టీ హోదా కొనసాగించవచ్చని CJI చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 4:3తో తీర్పు ఇచ్చింది. రెగ్యులర్ బెంచ్ ఈ అంశంపై తుది తీర్పు ఇస్తుందని పేర్కొంది. 1875లో ప్రారంభించిన ఈ సంస్థ 1920లో సెంట్రల్ యూనివర్సిటీగా మారగా, ఆ తర్వాత 1951లో ముస్లిం యూనివర్సిటీగా రూపాంతరం చెందింది.
Similar News
News January 15, 2026
కనుమ రోజు గారెలు తింటున్నారా?

కనుమ నాడు మినుము తింటే మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే మినుము తిన్నవాళ్లు ఇనుములా ఉంటారని మరో సామెత. చాలామంది కనుమరోజు కచ్చితంగా గారెలు తినేలా చూసుకుంటారు. అయితే పొట్టు తియ్యని మినుముల్లో పోషకాలు చాలానే ఉంటాయి. రాను రాను పొట్టు తీసిన మినప్పప్పు గారెలకు వాడుతున్నారు. కానీ మినప పొట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి శ్రేష్ఠం. మినుములో మాంసకృత్తులతోపాటు అనేక రకాలప్రోటీన్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి.
News January 15, 2026
టెన్త్ అర్హతతో RBIలో ఉద్యోగాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పదో తరగతి పాసైన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారికి అవకాశం లేదు. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. కచ్చితంగా తమ స్థానిక భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 4. సైట్: <
News January 15, 2026
ఎర్రవెల్లి నివాసంలో KCR సంక్రాంతి వేడుకలు

TG: ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నారు. కుమారుడు కేటీఆర్ కూడా ఫ్యామిలీతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఫాంహౌజ్లో రంగు రంగుల ముగ్గు ముందు కేసీఆర్తో కలిసి దిగిన ఫొటోలను KTR Xలో షేర్ చేశారు. తమ కుటుంబసభ్యుల తరఫున రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సంక్రాంతి విషెస్ చెప్పారు.


