News November 8, 2024

వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు

image

TG: ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామికి రాష్ట్ర మహిళా కమిషన్ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. నాగచైతన్య-శోభితల పెళ్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మహిళా కమిషన్ స్పందించింది. గతంలోనూ నోటీసులు ఇవ్వగా, కోర్టును ఆశ్రయించిన వేణుస్వామి విచారణ నుంచి తప్పించుకున్నారు. తాజాగా స్టే ఎత్తివేయడంతో మళ్లీ ఆయనకు నోటీసులు పంపింది.

Similar News

News November 8, 2024

రెండేళ్ల పదవీకాలంలో ఎన్నో కీలక తీర్పులు

image

50వ CJIగా జస్టిస్ DY చంద్ర‌చూడ్ రెండేళ్ల ప‌ద‌వీకాలంలో ఎన్నో కీల‌క‌ తీర్పులిచ్చారు. *అయోధ్య రామ మందిరం కేసులో తీర్పు ఇచ్చిన న్యాయ‌మూర్తుల్లో ఒక‌రు *JKలో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు సమర్థన *వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథ‌మిక హ‌క్కు *శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో మ‌హిళ‌ల‌కు ఎంట్రీ *ఏకాభిప్రాయ స్వ‌లింగ సంప‌ర్కానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త *వివాహంలో భార్యకు లైంగిక హక్కు ఉందని, బలవంతపు సంబంధాన్ని నేరంగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చారు.

News November 8, 2024

బాధ‌పెట్టుంటే క్ష‌మించండి: సీజేఐ చంద్ర‌చూడ్‌

image

త‌న ప‌ద‌వీకాలంలో అనుకోకుండా ఎవ‌రినైనా బాధ‌పెట్టుంటే క్ష‌మించాల‌ని సుప్రీంకోర్టు CJI జస్టిస్ DY చంద్ర‌చూడ్ కోరారు. శుక్ర‌వారం ఆయ‌న సీజేఐగా ప‌ద‌వీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా స‌హ‌చ‌ర న్యాయ‌మూర్తులు, న్యాయ‌వాదులు ఆయ‌న‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. త‌దుప‌రి CJIగా జ‌స్టిస్ సంజీవ్ ఖన్నా లాంటి సమర్థులు బాధ్యతలు చేప‌ట్ట‌బోతున్నందున తాను ఈ కోర్టును వ‌దిలివెళ్లినా తేడా ఉండ‌బోద‌న్నారు.

News November 8, 2024

ఆధార్ అప్‌డేట్ చేసుకున్నారా?

image

ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు ఆధార్ కార్డు కీలకం. అయితే ఎంతో మంది పదేళ్లు దాటినా వాటిని అప్‌డేట్ చేసుకోవడం లేదు. చిరునామా, ఫొటోలను అప్‌డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు. ఈ నేపథ్యంలో పదేళ్లు దాటిన ఆధార్‌లో సమాచారాన్ని ఫ్రీగా అప్‌డేట్ చేసుకునేందుకు DEC 14 వరకు కేంద్రం గడువునిచ్చింది. ఇదే చివరి గడువు కావొచ్చని ప్రచారం సాగుతోంది. MyAadhaar పోర్టల్‌‌లో లాగిన్ అయి అప్‌డేట్ చేసుకోండి.