News November 8, 2024
రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ: మంత్రి అచ్చెన్న
AP: వైసీపీ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పుడు ఎలాంటి నిబంధనల అడ్డు లేకుండా రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. పంటను కొనుగోలు చేసిన 48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమచేస్తామని పునరుద్ఘాటించారు. రైతుల నుంచి ప్రతి గింజా కొంటామని స్పష్టం చేశారు.
Similar News
News November 8, 2024
ఈనెల 30న INDvsPAK మ్యాచ్
మెన్స్ U19 ఆసియా కప్ టోర్నీని ఈనెల 29 నుంచి నిర్వహించనున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ సీజన్ దుబాయి, షార్జా వేదికగా 50 ఓవర్ ఫార్మాట్లో జరుగుతుందని తెలిపింది. గ్రూప్-Aలో ఇండియా, పాకిస్థాన్, యూఏఈ, జపాన్, గ్రూప్-Bలో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, నేపాల్ ఉన్నాయి. INDvsPAK మ్యాచ్ ఈనెల 30న జరగనుంది. ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 8న దుబాయిలో నిర్వహించనున్నారు.
News November 8, 2024
పదో తరగతి పరీక్షల ఫీజు తేదీల ప్రకటన
TG: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18 వరకు గడువు ఇచ్చింది. రూ.50 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో DEC 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు చెల్లించవచ్చని పేర్కొంది.
News November 8, 2024
త్వరలోనే సినిమా చూపిస్తాం: రేవంత్
TG: బీఆర్ఎస్ నేతలకు ఇవాళ ట్రైలర్ మాత్రమే చూపించామని, త్వరలోనే సినిమా చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. హరీశ్, కేటీఆర్ దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ డిజైన్లు ఖరారవుతాయని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనకు ఎవరైనా అడ్డొస్తే చరిత్ర హీనులుగా మారతారని అన్నారు.