News November 8, 2024

విజయమ్మ, షర్మిలపై జగన్ పిటిషన్.. విచారణ వాయిదా

image

AP: విజయమ్మ, షర్మిలతో ఆస్తుల వివాదంపై జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో విచారణ జరిగింది. తనకు తెలియకుండా తల్లి, చెల్లి షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట షేర్లు కొనసాగేలా చూడాలని కోరారు. కౌంటర్ దాఖలకు విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో విచారణను వచ్చే నెల 13కు ఎన్‌సీఎల్‌టీ వాయిదా వేసింది.

Similar News

News November 8, 2024

పదో తరగతి పరీక్షల ఫీజు తేదీల ప్రకటన

image

TG: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18 వరకు గడువు ఇచ్చింది. రూ.50 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో DEC 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు చెల్లించవచ్చని పేర్కొంది.

News November 8, 2024

త్వరలోనే సినిమా చూపిస్తాం: రేవంత్

image

TG: బీఆర్ఎస్ నేతలకు ఇవాళ ట్రైలర్ మాత్రమే చూపించామని, త్వరలోనే సినిమా చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. హరీశ్, కేటీఆర్ దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ డిజైన్లు ఖరారవుతాయని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనకు ఎవరైనా అడ్డొస్తే చరిత్ర హీనులుగా మారతారని అన్నారు.

News November 8, 2024

పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని పీసీబీకి బీసీసీఐ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా అక్కడికి రాలేమని తెలిపినట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు భారత్ తమ దేశానికి వస్తుందని పాక్ ఊహల్లో విహరించింది. దీనిపై బీసీసీఐ స్పష్టతనివ్వడంతో దుబాయ్‌లో హైబ్రిడ్ విధానంలో మ్యాచులు నిర్వహించాలని పీసీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.