News November 8, 2024
AUSvsPAK: రెండో వన్డేలో పాక్ ఘన విజయం
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూలు 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటయ్యారు. హారిస్ రౌఫ్ 5, షాహీన్ అఫ్రిదీ 3 వికెట్లు తీశారు. 164 రన్స్ లక్ష్యాన్ని పాక్ 26.3 ఓవర్లలో ఛేదించింది. సయీమ్ ఆయుబ్ 82, అబ్దుల్లా 64*, బాబర్ 15* రన్స్ చేశారు. 3 వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో ఉన్నాయి.
Similar News
News November 8, 2024
త్వరలోనే సినిమా చూపిస్తాం: రేవంత్
TG: బీఆర్ఎస్ నేతలకు ఇవాళ ట్రైలర్ మాత్రమే చూపించామని, త్వరలోనే సినిమా చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. హరీశ్, కేటీఆర్ దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ డిజైన్లు ఖరారవుతాయని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనకు ఎవరైనా అడ్డొస్తే చరిత్ర హీనులుగా మారతారని అన్నారు.
News November 8, 2024
పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని పీసీబీకి బీసీసీఐ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా అక్కడికి రాలేమని తెలిపినట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు భారత్ తమ దేశానికి వస్తుందని పాక్ ఊహల్లో విహరించింది. దీనిపై బీసీసీఐ స్పష్టతనివ్వడంతో దుబాయ్‌లో హైబ్రిడ్ విధానంలో మ్యాచులు నిర్వహించాలని పీసీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 8, 2024
బీఆర్ఎస్‌కు ప్రజల్ని దోచుకోవడమే తెలుసు: రేవంత్
TG: అణుబాంబులతో జపాన్‌లోని నగరాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయో మూసీతో హైదరాబాద్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు ప్రజలను దోచుకోవడమే తెలుసని మండిపడ్డారు. దగాపడ్డ తెలంగాణను బాగు చేసుకునే బాధ్యత తనపై ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు.