News November 8, 2024

HYD: కుక్కలకు పిల్లలు పుట్టకుండా.. స్టెరిలైజేషన్!

image

గ్రేటర్ HYDలో కుక్కల బెడద రోజు రోజుకు పెరిగి పోతుంది. ఈ నేపథ్యంలో దాన్ని నివారించేందుకు అధికారులు స్టెరిలైజేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎల్బీనగర్ పరిధి ఫతుల్లాగూడ యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రంలో యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ అందించడంతో పాటు, కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేస్తున్నట్లు వివరించారు.

Similar News

News December 26, 2024

రేపు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సమావేశం

image

బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో రేపు బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతి నాయకులు, 40కి పైగా బీసీ సంఘాలు పాల్గొననున్నారు. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 10 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

News December 26, 2024

HYD: ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌ను ఖండించిన KTR

image

BRS రాష్ట్ర నేత <<14984793>>ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను<<>> పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. BRS పార్టీకి కేసులేమి కొత్త కాదన్నారు.

News December 26, 2024

HYD: ఫిబ్రవరి 3న లక్ష డప్పుల మహాప్రదర్శన

image

ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని 2025, ఫిబ్రవరి 3న HYDలో జరిగే వెయ్యి గొంతులు, లక్ష డప్పుల మహాప్రదర్శనను విజయవంతం చేయాలని గురువారం MRPS, MSF, MSP అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు కోరారు. దీనికి సంబంధించిన సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లోతుకుంటలోని శుభశ్రీ గార్డెన్‌లో జరుగుతుందని, ముఖ్యఅతిథిగా దండోరా దళపతి మందకృష్ణ మాదిగ హాజరువుతారన్నారు.