News November 8, 2024
సమోసాల మిస్సింగ్‌పై నో ఎంక్వైరీ: CID
హిమాచల్ ప్రదేశ్ CID ఆఫీసులో సమోసాలు మిస్ అవ్వడంపై అధికారికంగా ఎలాంటి విచారణకు ఆదేశించలేదని DG సంజీవ్ రంజన్ తెలిపారు. CM సుఖ్వీందర్ సింగ్ పాల్గొన్న సమావేశంలో అతిథుల కోసం తెప్పించిన స్నాక్స్ ప్యాకెట్లు కనిపించకపోవడంతో అధికారులు వాటి కోసం వెతికారని వెల్లడించారు. ఇదో సామాన్యమైన అంతర్గత విషయమన్నారు. బాక్సులను వెతికేందుకు కేవలం అప్పీల్ చేశామన్నారు. దీన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
Similar News
News November 8, 2024
భారీ జీతంతో SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) టెలికమ్యూనికేషన్ విభాగంలో 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సై పోస్టులకు 20-25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు ఉండాలి. ఎస్సైల పే స్కేల్ రూ.35,400-1,12,400, హెడ్ కానిస్టేబుల్ పే స్కేల్ రూ.25,500-81,100గా ఉంది. <
News November 8, 2024
తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా?: హరీశ్
TG: కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదా? రేవంత్ సీఎం అయ్యేవాడా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. KCR ఆనవాళ్లు లేకుండా మూసీ శుద్ధి చేయడం సాధ్యం కాదని అన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలలైనా ఒక్క ఇళ్లు కట్టలేదని దుయ్యబట్టారు. కూలగొట్టడం తప్ప నిర్మించడం రేవంత్‌కు తెలియదని మండిపడ్డారు. సీఎం బెదిరింపులకు భయపడమని, ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.
News November 8, 2024
సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెట్టవద్దు: ఏపీ పోలీస్
సోషల్ మీడియాలో కుల, మత వర్గాల మధ్య విబేధాలకు దారితీసే పోస్టులు పెట్టవద్దని విజయవాడ పోలీసులు ఓ ప్రకటనలో సూచించారు. మార్ఫింగ్, ట్రోలింగ్, అశ్లీల, హింసాత్మక ఫొటోలు/వీడియోలు, తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయవద్దని పేర్కొన్నారు. ఫేక్ అకౌంట్స్‌తో అసభ్యకర పోస్టులు, మెసేజులు చేయడం, ఆన్లైన్ వేధింపులు, చట్టవిరుద్ధ కార్యాకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఫిర్యాదులకు 112కు కాల్ చేయాలన్నారు.