News November 8, 2024

రంజీల్లో ఆడటం వృథానేనా?: హర్భజన్

image

రంజీల్లో 6000 రన్స్, 400 వికెట్స్ తీసిన తొలి క్రికెటర్‌గా కేరళ ప్లేయర్ జలజ్ సక్సేనా చరిత్ర సృష్టించారు. అయితే దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నా అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయట్లేదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ హర్భజన్ ‘అతడిని ఇండియా-Aకైనా ఎంపిక చేయాల్సింది. రంజీల్లో ఆడటం వృథానేనా? ప్లేయర్లు IPL నుంచే ఎంపికవుతున్నారు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News November 8, 2024

మూసీ నీళ్లతో కడిగినా నీ నోరు మురికి పోదు: హరీశ్

image

KCR కాలిగోటికి కూడా సరిపోని రేవంత్ <<14562919>>CM<<>> స్థాయి దిగజారి మాట్లాడుతున్నారంటూ హరీశ్ రావు మండిపడ్డారు. ‘కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి పద్యం CMకు సరిగ్గా సరిపోతుంది. KCRపై నువ్వు చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయం. మూసీ నీళ్లతో కడిగినా నీ నోరు మురికి పోదు. నీ దొంగబుద్ధిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తాం. ప్రగల్భాలు మాని పరిపాలనపై దృష్టి పెట్టు’ అని ట్వీట్ చేశారు.

News November 8, 2024

SAvsIND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

image

భారత్‌తో డర్బన్‌లో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు: అభిషేక్, సంజూ, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి
సౌతాఫ్రికా జట్టు: ర్యాన్ రికెల్‌టన్, మార్క్రమ్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, క్రూగర్, జాన్సెన్, సైమ్‌లేన్, కొయెట్జీ, కేశవ్ మహరాజ్, పీటర్

News November 8, 2024

నో మోర్ మీడియా ట్ర‌య‌ల్స్‌: కేర‌ళ హైకోర్టు

image

విచార‌ణ‌లో ఉన్న కేసుల విష‌యంలో ద‌ర్యాప్తు/న్యాయాధికారి పాత్ర పోషించ‌కుండా మీడియా స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని కేరళ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. భావ ప్ర‌క‌ట‌నా, వాక్ స్వాతంత్య్రం ప్రాథమికాంశాలే అయినా తప్పొప్పులను నిర్ధారించేందుకు అది లైసెన్స్ కాద‌ని వ్యాఖ్యానించింది. మీడియా ట్ర‌య‌ల్స్ వ‌ల్ల ప్ర‌జ‌ల్లో ముందస్తు అభిప్రాయాలు ఏర్పడే అవకాశముందని, అది న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై అప‌న‌మ్మకానికి దారితీస్తుంద‌ంది.