News November 8, 2024
రేవంత్ రెడ్డి అంచలంచెలుగా ఎదిగి.. సీఎం దాకా !
8 నవంబర్ 1969లో జన్మించిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశ నుంచి అంచలంచలుగా ఎగిది నేడు సీఎం అయ్యారు. 2006లో ZPTCగా, 2007 MLCగా, 2019లో మల్కాగిజిరి ఎంపీగా, 2009, 2014, 2023 నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 7 జూలై 2021–6 సెప్టెంబర్ 2024 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 7 డిసెంబర్ 2023న తెలంగాణ 2వ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.
Similar News
News November 24, 2024
MBNR: 27 నుంచి సెమిస్టర్-2 ప్రయోగ పరీక్షలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో సైన్స్ & కంప్యూటర్ చదువుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు MVS డిగ్రీ కళాశాలలో ఈనెల 27 నుంచి ప్రయోగ పరీక్షలు (సెమిస్టర్-2) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి, రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, ఫీజు చెల్లించిన రసీదు, గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు.
News November 23, 2024
30న పాలమూరుకు సీఎం రేవంత్ రాక
మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 30న వస్తున్నట్లుదేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లతో మధ్యాహ్నం 12:00 గంటలకు సమీక్ష సమావేశం ఉంటుందన్నారు.
News November 23, 2024
NGKL: దారుణం.. భర్తను హత్య చేసిన భార్య, కూతురు
NGKL జిల్లా తెలకపల్లి మండలంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. పోలీసుల వివరాలు.. వట్టిపల్లికి చెందిన ఈశ్వరయ్యను భూమి అమ్మకం విషయమై తన భార్య ఎల్లమ్మ, బావమరిది బాలస్వామి, పెద్దకూతురు స్వాతి, పెద్దఅల్లుడు మల్లేశ్, మరదలు ఆశమ్మలు హత్య చేశారు. గొడ్డలితో దాడిచేసి, మర్మాంగాన్ని కత్తిరించి హతమార్చారు. మృతుడి చెల్లెలు నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు CI కనకయ్య గౌడ్ తెలిపారు.