News November 8, 2024
తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్

భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన సతీమణి అతియా శెట్టి త్వరలో పేరెంట్స్ కాబోతున్నారు. 2025లో తాము బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఈ స్టార్ కపుల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2023 జనవరిలో వీరికి వివాహమైంది. అతియా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అనే విషయం తెలిసిందే.
Similar News
News January 6, 2026
మనుషుల కేసుల్లో కూడా ఇన్ని అప్లికేషన్లు రావు: SC

వీధి కుక్కల కేసులో పెద్ద మొత్తంలో మధ్యంతర దరఖాస్తులు రావడంపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సాధారణంగా మనుషుల విషయంలో కూడా ఇన్ని అప్లికేషన్లు రావు’ అని జస్టిస్ మెహతా అన్నారు. ఈ కేసును ముగ్గురు జడ్జిల బెంచ్ రేపు విచారిస్తుందని తెలిపారు. కుక్క కాట్లు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరిలైజేషన్, టీకాల తర్వాత షెల్టర్లకు కుక్కలను తరలించాలని గతేడాది నవంబర్‌లో కోర్టు ఆదేశాలిచ్చింది.
News January 6, 2026
వెనిజులా తర్వాత.. ఈ దేశాలే ట్రంప్ టార్గెట్?

వెనిజులాపై <<18751661>>దాడి<<>> చేసి ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అలజడి సృష్టించారు. ఇప్పుడు ఆయన గ్రీన్లాండ్, కొలంబియా, ఇరాన్, మెక్సికో, క్యూబాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఆయన గుర్రుగా ఉన్నారు. <<18742175>>అటాక్‌కు సిద్ధమని<<>> ఇటీవల హెచ్చరించారు. గ్రీన్లాండ్లోని ఐస్‌ల్యాండ్‌పై కన్నేశారు. క్యూబా దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా మిగిలింది. కొలంబియా, మెక్సికో డ్రగ్ ముఠాలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు.
News January 6, 2026
VIRAL: ఈ పెద్ద కళ్ల మహిళ ఎవరు?

కర్ణాటకలో ఎక్కడ చూసినా ఓ మహిళ ఫొటో కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగులు, పొలాలు, దుకాణాలు ఇలా ప్రతి చోట ఆమె చిత్రాన్ని దిష్టి బొమ్మగా పెడుతున్నారు. దీంతో పెద్ద కళ్లతో, సీరియస్‌గా చూస్తున్న ఆ మహిళ ఎవరంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ‘ఆమె పేరు నిహారికా రావు. కర్ణాటకకు చెందిన యూట్యూబర్. 2023లో ఓ వీడియో క్లిప్ నుంచి తీసుకున్నదే ఆ లుక్’ అని కొందరు యూజర్లు పేర్కొంటున్నారు.


