News November 8, 2024
వర్రా రవీంద్రా రెడ్డి అరెస్ట్
AP: YCP సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని మహబూబ్నగర్లో అదుపులోకి తీసుకున్నారు. అతడిని కడప పీఎస్కు తరలిస్తున్నట్లు సమాచారం. YCP అధికారంలో ఉండగా చంద్రబాబు, పవన్, వంగలపూడి అనితపై రవీంద్ర అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఇటీవల పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చి వదిలేయడంపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. కడప ఎస్పీపై బదిలీ వేటు వేసింది.
Similar News
News December 26, 2024
మస్కట్ బాధితురాలిని రాష్ట్రానికి రప్పించిన మంత్రి లోకేశ్
AP: మస్కట్లో చిక్కుకుపోయిన ఓ మహిళను మంత్రి నారా లోకేశ్ క్షేమంగా రాష్ట్రానికి రప్పించారు. కోనసీమ జిల్లా పోలెకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన వాసంశెట్టి పద్మ బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లారు. ఆమెకు అక్కడ యజమానుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె తన బాధను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన లోకేశ్ వెంటనే స్పందించి ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు.
News December 26, 2024
Latest Data: ఓటింగ్లో మహిళలే ముందు
2024 సార్వత్రిక ఎన్నికల్లో 65.78% మంది అర్హత కలిగిన మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. పురుషులు 65.55% మంది పోలింగ్లో పాల్గొన్నారు. తద్వారా వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు. 2019లో మొత్తంగా 61.40 కోట్ల మంది ఓటేస్తే, 2024లో 64.64 కోట్ల మంది ఓటేయడం గమనార్హం.
News December 26, 2024
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్?
ట్యాక్స్ పేయర్స్కి ఊరట కలిగించేలా 2025 బడ్జెట్లో కేంద్రం నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2020లో తెచ్చిన పన్ను విధానం కింద ₹3.5 లక్షల- ₹10.50 లక్షల ఆదాయానికి 5-20%, ఈ మొత్తానికి మించితే 30% పన్ను చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం దేశం అర్థిక సవాళ్లు ఎదుర్కొంటుండడం, పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో Tax Payersకి ఊరట కలిగించేలా Budgetలో నిర్ణయాలుంటాయని సమాచారం.