News November 8, 2024

NZB: ఏసీబీకి చిక్కిన ఎస్సై అరెస్ట్

image

రూ.20 వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన వర్ని SI బి.కృష్ణ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు ACB అధికారులు తెలిపారు. అనంతరం కృష్ణకుమార్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. కాగా వర్ని మండలం కోటయ్య క్యాంపు గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వటానికి రూ.20 వేలు లంచం అడగగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడన్నారు.

Similar News

News January 17, 2026

NZB: మందుగుండు పేలి ఆవు మృతి

image

వన్యప్రాణుల వేట కోసం దుండగులు వేసిన ఉచ్చు ఒక పాడిఆవు ప్రాణాలను బలితీసుకుంది. రెంజల్ మండలం దూపల్లికి చెందిన కారె సాయికుమార్ అనే రైతు తన ఆవును మేత కోసం జాన్కంపేట్ శివారులోకి తీసుకెళ్లారు. అడవిపందుల కోసం పేలుడు మందును పశువులకు పెట్టే తవుడులో ముద్దలుగా చేసి ఉంచారు. మేత మేస్తున్న క్రమంలో ఆవు ఆ తవుడు ముద్దను తినగానే ఒక్కసారిగా నోట్లోనే పేలుడు సంభవించి ఆవు నోటిభాగం తీవ్రంగా ఛిద్రమై మృతి చెందింది.

News January 17, 2026

NZB: ఆశవాహుల్లో ఉత్కంఠ

image

నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు శనివారం మహిళా రిజర్వేషన్లను ప్రకటించనున్న నేపథ్యంలో పోటీ చేసే ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొంది. ఏ స్థానం ఎవరికి రిజర్వు అవుతుందోనని కార్పొరేటర్, కౌన్సిలర్ ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్, BJP, BRSపార్టీల నేతలు తమ వారిని నిలబెట్టించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

News January 17, 2026

NZB: గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్:SI

image

నిజామాబాద్ ITI కాలేజ్ గ్రౌండ్ వద్ద ఎండు గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు నిన్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు 2వ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు. నిందితుడు షేక్ అఫ్రోజ్ అలియాస్ రోడ్డ అఫ్రోజ్ నుంచి 210 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. MH నుంచి గంజాయి తీసుకుని వచ్చి NZBలో అమ్ముతుంటాడని, ఇతడిపై వివిధ PS లలో గంజాయికి సంబంధించిన కేసులు 13కు పైగా ఉన్నాయన్నారు.