News November 8, 2024
మాజీ సీఎంలు అసెంబ్లీకి రావట్లేదు.. ఎందుకు?
తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. TGలో ప్రతిపక్ష నేత KCR ఇప్పటివరకూ అసెంబ్లీకి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు KCR అక్కర్లేదని, తాము చాలని KTR, హరీశ్ అంటున్నారు. తాజాగా AP మాజీ సీఎం జగన్ తాము అసెంబ్లీకి వెళ్లమని ప్రకటించారు. అసెంబ్లీలో ప్రతిపక్షమంటూ ఉన్నది తామేనని, ఆ హోదా ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 9, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 9, 2024
నేడు మహారాష్ట్రకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఉ.8 గంటలకు శంషాబాద్ నుంచి ముంబైకి వెళ్తారు. అక్కడ కాంగ్రెస్ సీఎంల సమావేశంలో పాల్గొంటారు. మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల మ్యానిఫెస్టోపై సలహాలు వంటి పలు విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో రేవంత్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు.
News November 9, 2024
భారత్ ఆల్‌రౌండ్ షో.. సౌతాఫ్రికాపై విజయం
సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టింది. దీంతో 61 రన్స్ తేడాతో విజయం సాధించింది. 203 టార్గెట్‌తో బరిలోకి దిగిన SAను 141 రన్స్‌కే కట్టడి చేసింది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు తీసి SA పతనాన్ని శాసించారు. అవేశ్ ఖాన్ 2, అర్ష్‌దీప్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ 4 టీ20ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.