News November 8, 2024
నో మోర్ మీడియా ట్రయల్స్: కేరళ హైకోర్టు

విచారణలో ఉన్న కేసుల విషయంలో దర్యాప్తు/న్యాయాధికారి పాత్ర పోషించకుండా మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. భావ ప్రకటనా, వాక్ స్వాతంత్య్రం ప్రాథమికాంశాలే అయినా తప్పొప్పులను నిర్ధారించేందుకు అది లైసెన్స్ కాదని వ్యాఖ్యానించింది. మీడియా ట్రయల్స్ వల్ల ప్రజల్లో ముందస్తు అభిప్రాయాలు ఏర్పడే అవకాశముందని, అది న్యాయవ్యవస్థపై అపనమ్మకానికి దారితీస్తుందంది.
Similar News
News February 10, 2026
BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల శాలరీలివే!

భారత క్రికెట్ జట్టు ప్లేయర్లకు <<19095739>>BCCI<<>> తాజాగా 3 గ్రేడ్లలో చోటు కల్పించిన విషయం తెలిసిందే. గ్రేడ్-Aలో ఉన్న ఆటగాళ్లకు రూ.5కోట్లు చెల్లించనుంది. గ్రేడ్-B క్రికెటర్లకు రూ.3 కోట్లు, గ్రేడ్-C క్రికెటర్లకు రూ. కోటి చొప్పున ఇవ్వనుంది. దీంతో పాటు మ్యాచ్ ఫీజులు అదనం. తాజా కాంట్రాక్ట్‌లో గ్రేడ్-Bకు డిమోట్ అయిన రోహిత్, విరాట్ రూ.3 కోట్ల చొప్పున అందుకోనున్నారు. గతంలో ఉన్న A+ గ్రేడ్‌ను BCCI తొలగించింది.
News February 10, 2026
ఉపవాసం: ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు?

ఉపవాసం శ్రేష్ఠమైనదే అయినా అందరికీ వర్తించదు. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మధుమేహం, రక్తహీనత, గుండె జబ్బులు ఉన్నవారు సుదీర్ఘ సమయం ఆహారం మానేస్తే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. స్థూలకాయులు, BP, చర్మ వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహాతో ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
News February 10, 2026
స్పీకర్‌పై అవిశ్వాసం.. మెజార్టీ ఉంటేనే!

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్షాలు ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 94-C కింద తీర్మానం ప్రవేశ పెట్టాలి అంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలి. సభలోని 50 మంది సభ్యులు మద్దతుతో నోటీసు ఇచ్చాక చర్చకు నిర్దేశిస్తారు. 10 రోజుల్లోపే చర్చ చేపట్టి ఓటింగ్ నిర్వహిస్తారు. మెజార్టీ ఆధారంగా అనర్హత వేటు ఉంటుంది. కాగా లోక్‌సభలో NDAకే మెజార్టీ ఉండటంతో స్పీకర్ తొలగింపు అసాధ్యమే.


