News November 8, 2024

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. అదీ ₹10 స్టాంప్ పేప‌ర్‌‌తో

image

పై ఫొటోలో కనిపిస్తున్న ₹500 నోటు చూడటానికి ఒరిజినల్‌గా క‌నిపిస్తున్నా ఇది న‌కిలీది. అది కూడా ₹10 స్టాంప్ పేప‌ర్‌ను ఉప‌యోగించి త‌యారు చేశారు. యూపీలోని సోన్‌భ‌ద్రా జిల్లాకు చెందిన స‌తీశ్ రాయ్‌, ప్ర‌మోద్ మిశ్రా యాడ్స్ ప్రింటింగ్ రంగంలో ప‌నిచేస్తున్నారు. వీరు యూట్యూబ్‌లో నోట్ల త‌యారీ నేర్చుకున్నారు. న‌కిలీ నోట్ల ప్రింటింగ్ ప్రారంభించి ఫర్జీ సిరీస్‌ను రియల్‌గా చూపించారు. చివరికి పోలీసులకు చిక్కారు.

Similar News

News November 9, 2024

చట్టాలను ఉల్లంఘించిన స్విగ్గీ, జొమాటో: నివేదిక

image

స్విగ్గీ, జొమాటో సంస్థలు భారత్‌లో కాంపిటీషన్ చట్టాలను అతిక్రమించాయని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) తేల్చింది. తమ యాప్‌లలో కొన్ని హోటళ్లకు ప్రాధాన్యాన్ని ఇచ్చి, వాటికి లాభాన్ని చేకూర్చేలా రెండు కంపెనీలు వ్యవహరించాయని పేర్కొంది. దీనికోసం ఆయా హోటళ్లతో కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయని ఆరోపించింది. ఈ విషయంలో వాటిపై ఎటువంటి పెనాల్టీ విధించాలన్నది త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

News November 9, 2024

T20I: భారత్ తరఫున అత్యధిక సెంచరీలు

image

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(5) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్ (4), కేఎల్ రాహుల్ (2), సంజూ శాంసన్ (2) ఉన్నారు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాపై వరుస సెంచరీలు చేసిన సంజూ ఈ జాబితాలో కేఎల్ సరసన చేరారు.

News November 9, 2024

నవంబర్ 9: చరిత్రలో ఈరోజు

image

* ప్రపంచ నాణ్యతా దినోత్సవం
* 1877: కవి మహమ్మద్ ఇక్బాల్ జననం
* 1895: ఆధునిక ఆంధ్ర కవి దువ్వూరి రామిరెడ్డి జననం
* 1924: రచయిత, కథకుడు కాళీపట్నం రామారావు జననం
* 1978: సినీనటుడు రాజా పుట్టినరోజు
* 2009: నోబెల్ గ్రహీత హర‌గోబింద్ ఖురానా మరణం(ఫొటోలో)
* 2005: మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మరణం