News November 8, 2024

డైరెక్టర్ క్రిష్ పెళ్లి చేసుకోబోయేది ఈమెనేనా?

image

సినీ డైరెక్టర్ క్రిష్ ఈనెల 10న రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. HYDకు చెందిన గైనకాలజిస్ట్ డా.ప్రీతి చల్లాతో ఆయన వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈనెల 16న జరిగే రిసెప్షన్‌కు సినీ ప్రముఖులు హాజరవుతారని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. 2016లో మొదటి వివాహం చేసుకున్న క్రిష్ 2018లో విడాకులు తీసుకున్నారు. వేదం, గమ్యం, మణికర్ణిక, గౌతమీపుత్ర శాతకర్ణి తదితర సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.

Similar News

News November 9, 2024

రేపు అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. పశ్చిమ దిశగా కదులుతూ ఇది తమిళనాడు/ శ్రీలంక తీరాలకు సమీపంగా వెళ్తుందని తెలిపింది. దీని ప్రభావంతో APలోని ప్రకాశం, NLR, TPTY, అన్నమయ్య జిల్లాల్లో సోమవారం నుంచి 3 రోజులు భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయంది. సముద్రం అలజడిగా ఉంటుందని, వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది.

News November 9, 2024

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

image

TG: మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతిదేవి మరణించారు. అనారోగ్యంతో ఇటీవల బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూశారు. జ్యోతిదేవి మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలియజేశారు. 1998లో మెట్‌పల్లి ఉపఎన్నిక సందర్భంగా ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. సుమారు 17 నెలలపాటు ఎమ్మెల్యేగా సేవలందించారు.

News November 9, 2024

‘పది’ పరీక్ష ఫీజు చెల్లింపునకు 18 లాస్ట్ డేట్

image

TG: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 18 తుది గడువు అని పరీక్షల విభాగం కన్వీనర్ ఎ.కృష్ణారావు తెలిపారు. రూ.50-రూ.500 వరకు ఆలస్య రుసుముతో DEC 21 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఎగ్జామ్ ఫీజును రూ.125గా నిర్ణయించినట్లు చెప్పారు. SC, ST, BC విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం పట్టణాల్లో రూ.24వేలు, గ్రామాల్లో రూ.20వేల లోపు ఉండి, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పిస్తే ఫీజు మినహాయింపు ఉంటుందని తెలిపారు.