News November 9, 2024
2024 US Results Final: ఆ రెండూ ట్రంప్ ఖాతాలోకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఆలస్యమైన ఆరిజోనా, నెవాడాలను కూడా రిపబ్లికన్ పార్టీ గెలుచుకుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పటికే 295 ఎలక్టోరల్ ఓట్లతో విజయదుందుబి మోగించిన ట్రంప్ ఆరిజోనా(11), నెవాడా(6)లోనూ గెలుపొందారు. దీంతో రిపబ్లికన్లు మొత్తంగా 312 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు. డెమోక్రాట్లు 226 ఓట్లకు పరిమితమయ్యారు. 2016లో సాధించిన 304 ఓట్ల మెజారిటీని ట్రంప్ అధిగమించారు.
Similar News
News November 9, 2024
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
TG: మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతిదేవి మరణించారు. అనారోగ్యంతో ఇటీవల బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూశారు. జ్యోతిదేవి మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలియజేశారు. 1998లో మెట్పల్లి ఉపఎన్నిక సందర్భంగా ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. సుమారు 17 నెలలపాటు ఎమ్మెల్యేగా సేవలందించారు.
News November 9, 2024
‘పది’ పరీక్ష ఫీజు చెల్లింపునకు 18 లాస్ట్ డేట్
TG: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 18 తుది గడువు అని పరీక్షల విభాగం కన్వీనర్ ఎ.కృష్ణారావు తెలిపారు. రూ.50-రూ.500 వరకు ఆలస్య రుసుముతో DEC 21 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఎగ్జామ్ ఫీజును రూ.125గా నిర్ణయించినట్లు చెప్పారు. SC, ST, BC విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం పట్టణాల్లో రూ.24వేలు, గ్రామాల్లో రూ.20వేల లోపు ఉండి, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పిస్తే ఫీజు మినహాయింపు ఉంటుందని తెలిపారు.
News November 9, 2024
ప్రియాంకా గాంధీ తరఫున సీతక్క ప్రచారం
TG: కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ తరఫున మంత్రి సీతక్క ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆమె రెండు, మూడు రోజులు అక్కడే ఉండి ఓట్లు అభ్యర్థించనున్నారు. కాగా నిన్నటివరకు సీతక్క మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.