News November 9, 2024

టెస్టు సిరీస్ ఓటమి: 6 గంటల పాటు మీటింగ్!

image

స్వదేశంలో భారత్ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ వైట్‌వాష్‌కి గురవ్వడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్, సెలక్టర్ అజిత్ అగార్కర్, బోర్డు పెద్దలు జై షా, రోజర్ బిన్నీ మధ్య 6 గంటల పాటు సుదీర్ఘంగా మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. రోహిత్, గంభీర్‌కు బిన్నీ, షా పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రధానంగా ఓటమికి కారణాలపై చర్చ జరిగిందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

Similar News

News November 9, 2024

ప్రియాంకా గాంధీ తరఫున సీతక్క ప్రచారం

image

TG: కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ తరఫున మంత్రి సీతక్క ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆమె రెండు, మూడు రోజులు అక్కడే ఉండి ఓట్లు అభ్యర్థించనున్నారు. కాగా నిన్నటివరకు సీతక్క మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

News November 9, 2024

‘హాట్’ యోగా అంటే?

image

ఒక గదిలో సాధారణం కంటే అధిక టెంపరేచర్‌ను మెయింటేన్ చేస్తూ చేసేదే ‘హాట్’ యోగా. దీనివల్ల కేలరీలు అధికంగా ఖర్చై బరువు తగ్గుతారని నమ్మకం. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని యోగా నిపుణులు చెబుతున్నారు. హాట్ యోగా వల్ల డీహైడ్రేషనై శరీరంలోని ఫ్లూయిడ్ అంతా ఆవిరైపోతుందని చెబుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో చర్మ సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. హాట్ యోగా చలి అధికంగా ఉండే దేశాల్లోని ప్రజల కోసమని పేర్కొన్నారు.

News November 9, 2024

రాహుల్ దిశానిర్దేశంలేని క్షిపణి: అస్సాం సీఎం

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నియంత్రణ లేదంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు మండిపడ్డారు. ‘రాహుల్ ప్రస్తుతం నియంత్రణ లేని క్షిపణిలా ఉన్నారు. సోనియా శిక్షణనివ్వకపోతే మున్ముందు దారీతెన్నూ లేని క్షిపణిగా మారతారు. ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ఝార్ఖండ్‌కు వచ్చిన రాహుల్ తీవ్రవాదుల గురించి ఒక్క ముక్కా మాట్లాడలేదు. ఆయన గిరిజనులకు, వెనుకబాటు వర్గాలకు వ్యతిరేకి’ అని విమర్శించారు.