News November 9, 2024

TODAY HEADLINES

image

☛ TG: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట.. సీఎం రేవంత్ ఆదేశం
☛ బీఆర్ఎస్ నేతలకు త్వరలో సినిమా చూపిస్తాం: సీఎం రేవంత్
☛ తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా?: హరీశ్ రావు
☛ AP: త్వరలో వాట్సాప్ ద్వారా వంద పౌర సేవ‌లు: మంత్రి లోకేశ్
☛ జగన్‌ను తిట్టే వారిపై ప్రభుత్వ చర్యలేవీ?: అంబటి రాంబాబు
☛ అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల
☛ INDvsSA: సంజూ శాంసన్ సెంచరీ

Similar News

News September 14, 2025

తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్ సోనారిక

image

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక శుభవార్త చెప్పారు. తాను తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు SMలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా సోనారిక తెలుగులో జాదుగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో నటించారు. 2022లో తన ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్ పరశా‌ర్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారు పెళ్లి చేసుకున్నారు.

News September 14, 2025

ఇతర భాషలకు హిందీ శత్రువు కాదు.. మిత్రుడు: అమిత్ షా

image

దేశంలో హిందీ భాషను ఇతర భాషలకు ముప్పుగా చూడొద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందీ ఇతర భాషలకు శత్రువు కాదని, మిత్రుడు అని హిందీ దివస్ కార్యక్రమంలో ఆయన చెప్పారు. ‘ఇందుకు గుజరాత్ పెద్ద ఉదాహరణ. ఇక్కడ గుజరాతీ మాట్లాడిన గాంధీ, దయానంద, వల్లభాయ్ పటేల్, KM మున్షి వంటి ఉద్ధండులు హిందీని ప్రోత్సహించారు. వందేమాతరం, జైహింద్ లాంటి నినాదాలు భాషా మేల్కొలుపు నుంచే ఉద్భవించాయి’ అని వ్యాఖ్యానించారు.

News September 14, 2025

ఇవాళ మ్యాచ్ ఆడకపోతే..

image

బాయ్‌కాట్ <<17706244>>డిమాండ్<<>> నేపథ్యంలో ఆసియాకప్‌లో ఇవాళ PAKతో టీమ్ ఇండియా ఆడకపోతే తర్వాతి మ్యాచులో (Vs ఒమన్‌తో) తప్పక గెలవాలి. గ్రూపులోని మిగతా జట్ల ప్రదర్శన ఆధారంగా సూర్య సేన సూపర్-4కు చేరనుంది. అయితే పాక్ కూడా వచ్చి, భారత్ బాయ్‌కాట్ కొనసాగిస్తే మిగతా 2 మ్యాచులు గెలవాలి. ఒకవేళ భారత్, పాక్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తే టోర్నీ దాయాది సొంతం అవుతుంది. వేరే జట్టు ఫైనల్ వస్తే అమీతుమీ తేల్చుకోవాలి.