News November 9, 2024
నూతన రైల్వే లైన్లతో మహబూబ్ నగర్ అభివృద్ధి: ఎంపీ మల్లు రవి
సికింద్రాబాద్ లోని రైల్ నిలయం కార్యాలయంలో దక్షణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో శుక్రవారం నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొత్త రైల్వే మార్గాలను ఏర్పాటు చేయాలని రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి చెందుతుందని మల్లు రవి చెప్పారు.
Similar News
News November 24, 2024
NRPT: జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రత ఈ గ్రామంలోనే
NRPT జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గత 5 రోజులుగా జిల్లా వ్యాప్తంగా విపరీతమైన చలి పెరగగా వాహనదారులు, వాకర్లు చలికి ఇబ్బంది పడుతున్నారు. నారాయణపేట జిల్లాలోని దామర్ గిద్ద మండలంలోని మొగల్ మడ్క గ్రామాల్లో ఆదివారం 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రతల నుంచి 17.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News November 24, 2024
MBNR: 27 నుంచి సెమిస్టర్-2 ప్రయోగ పరీక్షలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో సైన్స్ & కంప్యూటర్ చదువుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు MVS డిగ్రీ కళాశాలలో ఈనెల 27 నుంచి ప్రయోగ పరీక్షలు (సెమిస్టర్-2) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి, రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, ఫీజు చెల్లించిన రసీదు, గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు.
News November 23, 2024
30న పాలమూరుకు సీఎం రేవంత్ రాక
మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 30న వస్తున్నట్లుదేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లతో మధ్యాహ్నం 12:00 గంటలకు సమీక్ష సమావేశం ఉంటుందన్నారు.