News November 9, 2024

రేపు అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. పశ్చిమ దిశగా కదులుతూ ఇది తమిళనాడు/ శ్రీలంక తీరాలకు సమీపంగా వెళ్తుందని తెలిపింది. దీని ప్రభావంతో APలోని ప్రకాశం, NLR, TPTY, అన్నమయ్య జిల్లాల్లో సోమవారం నుంచి 3 రోజులు భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయంది. సముద్రం అలజడిగా ఉంటుందని, వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది.

Similar News

News February 10, 2026

పెట్టుబడి పరంగా నాకు గోల్డ్ కన్నా బిట్‌కాయిన్లే బెస్ట్: కియోసాకి

image

గోల్డ్, బిట్ కాయిన్‌ పెట్టుబడులకు మంచివేనని, ఒక్క దానినే సెలక్ట్ చేసుకోవాలంటే బిట్ కాయిన్‌కే తన ప్రయారిటీ అని ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి చెప్పారు. ‘డిమాండ్ పెరిగితే మైన్స్‌ నుంచి బంగారాన్ని ఉత్పత్తి చేయొచ్చు. 21మిలియన్ల తర్వాత బిట్ కాయిన్స్‌ క్రియేట్ చేయలేం. దీర్ఘకాలంలో ధర పెరుగుతుందని నమ్ముతున్నాను. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి నుంచి కాపాడే హార్ట్ అసెట్స్‌కే మద్దతిస్తాను’ అని తెలిపారు.

News February 10, 2026

బిడ్డకు పాలిస్తే క్యాన్సర్ నుంచి రక్షణ

image

పాలివ్వడం బిడ్డకే కాదు తల్లికీ రక్షేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. పాలివ్వడం వల్ల మహిళల్లో ఎక్కువగా వచ్చే ట్రిపుల్‌ నెగెటివ్‌ అనే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రాకుండా ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత వక్షోజాల్లో ‘సీడీ8+టీ’ అనే వ్యాధినిరోధక కణాలు ఏర్పడతాయి. ఇవి రక్షకభటుల్లా పనిచేస్తూ, వక్షోజాల్లోని క్యాన్సర్‌ కణాలని ఎప్పటికప్పుడు చంపేస్తూ ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

News February 10, 2026

ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవించట్లేదు: మాధవ్

image

AP: BJP MLA <<19084193>>ఆదినారాయణరెడ్డి<<>> ఇటీవల ప్రభుత్వ పాలనపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపడంపై రాష్ట్ర ఆ పార్టీ చీఫ్ PVN మాధవ్ స్పందించారు. ‘ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు. దీనిపై ఆయన్ను వివరణ అడుగుతాం. బీజేపీ సమావేశంలోనే ఆయన మాట్లాడినా ఆ వ్యాఖ్యలతో పార్టీ ఏకీభవించడం లేదు. అవన్నీ వ్యక్తిగత హోదాలోనే మాట్లాడారు’ అని మాధవ్ చెప్పారు.