News November 9, 2024

MBNR: నేడు, రేపు ఓటరు నమోదుకు ప్రత్యేక డ్రైవ్

image

ఓటర్ నమోదుకు ఈ నెల 9,10న బూత్ స్థాయి ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు తెలిపారు. ఫారం- 6,7,8,8ఏ దరఖాస్తులు బీఎల్ఓల దగ్గర అందుబాటులో ఉంటాయని, www.nvsp.in వెబ్సైట్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, 1950(టోల్ ఫ్రీ) నంబర్‌కు ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News January 17, 2026

పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం
✒MBNR: CM ఇలాకా.. BRSలో భారీగా చేరికలు
✒పాలమూరు జిల్లా అభివృద్ధి సీఎం బాధ్యత: డీకే అరుణ
✒వనపర్తి:భార్య చేతిలో భర్త దారుణ హత్య
✒రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించండి: సీఎం
✒సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన.. జర్నలిస్టులు ముందస్తు అరెస్ట్
✒పాలమూరులో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం:CM రేవంత్ రెడ్డి

News January 17, 2026

పాలమూరు జిల్లా అభివృద్ధి సీఎం బాధ్యత: డీకే అరుణ

image

పాలమూరు జిల్లా బిడ్డగా అభివృద్ధి చేయడం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత అని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. గత సీఎంలు తమ జిల్లాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని, ఎక్కువ దృష్టి పెట్టి జిల్లాలో సస్యశాసమలంగా మార్చే బాధ్యత తనపై పూర్తిగా ఉందని సూచించారు. విద్య వైద్యం పై అధిక శ్రద్ధ చూపించి ఉపాధి కల్పన జిల్లాగా పేరు మార్చుకునేలా అభివృద్ధిలో దూసుకొని పోయేలా అడుగులు వేయాలన్నారు.

News January 17, 2026

బతుకమ్మ చీరలు చేలల్లో కట్టడానికే పనికొచ్చినయ్: CM

image

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు పట్టుకునేందుకు పనికి రాలేదని చేన్లలో పందులు రాకుండా అడ్డుకునేందుకు పనికి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఆగం చేశారన్నారు.